Site icon NTV Telugu

Rajasaab : రాజాసాబ్ రచ్చ ముగిసింది.. షూటింగ్ షురూ అయింది..

Rajasaab

Rajasaab

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన  వచ్చింది.

Also Read : Rajinikanth : టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఫిక్స్?

ఇటీవల జరిగిన షూటింగ్స్ బంద్ కారణంగా రాజాసాబ్ షూటింగ్ ఆగింది. కొద్దీ రోజుల క్రితం బంద్ ముగియడంతో పెండింగ్ లో ఉన్న సినిమాలు అన్ని షూటింగ్స్ స్టార్ట్ చేసాయి. కానీ రాజాసాబ్ షూటింగ్ స్టార్ట్ కాలేదు. బంద్ సమయంలో ఫెడరేషన్ కు రాజాసాబ్ నిర్మాతకు మధ్య తకరారు నడించింది. దాంతో విశ్వ ప్రసాద్ సినిమా కు వచ్చేది లేదని భీష్మించుకూచున్నారు వర్క్సర్స్. ఈ నేపధ్యంలో ఈ సమస్యపై ఇరు వర్గాలు కూర్చుని చర్చించి పరిష్కరించుకున్నాయి. ఈ రోజు రాజాసాబ్ షూటింగ్ షురూ చేసారు. హైదరాబాద్ లోని అజీజ్ నగర్ PMF స్టూడియో లో షూట్ స్టార్ట్ చేసారు. 3-4 రోజుల ప్యాచ్ వర్క్ తో టాకీ పూర్తి అవుతుంది. మూడు సాంగ్స్, ఒక ఫైట్ షూట్ బ్యాలన్స్ ఉంది. చక చక షూటింగ్ చేసేసి డిసెంబరు మొదటి వారానికి ఫస్ట్ కాపీ రెడీ చెయ్యాలనేది యూనిట్ ప్లాన్ ఇక ముందు నుండి అనుకున్నట్టు రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా రిలీజ్ కాబోతుంది.

Exit mobile version