SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాల్లో ఉండే మాస్ ఎనర్జీ, హీరో క్యారెక్టరైజేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో పూరీ కమ్‌బ్యాక్ కోసం ఆయన అభిమానులు, టాలీవుడ్ వర్గాలు ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. ఈ తరుణంలో పూరీ జగన్నాథ్ నయా ప్రాజెక్ట్ ‘స్లమ్‌డాగ్’ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ అప్డేట్ పూరీ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపింది.
ఈ గుసగుసల ప్రకారం.. పూరీ జగన్నాథ్ తన అప్‌కమింగ్ మూవీ ‘స్లమ్‌డాగ్’ స్క్రిప్ట్‌ను లెజెండరీ రైటర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ వద్దకు తీసుకెళ్లారట. గతంలో పూరీ వరుస పరాజయాలను చూసి తట్టుకోలేకపోయిన విజయేంద్ర ప్రసాద్, సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ముందే స్క్రిప్ట్ తనకు చూపించాల్సిందిగా పూరీకి ఆత్మీయ సలహా ఇచ్చారట. పూరీ కథ చెప్పే విధానం, మేకింగ్ స్టైల్ అంటే విజయేంద్ర ప్రసాద్‌కు ఎంతో ఇష్టం. ఆ నమ్మకంతోనే పూరీ రాసుకున్న ‘స్లమ్‌డాగ్’ స్క్రిప్ట్‌ను ఆయన లైన్ బై లైన్ పరిశీలించి, కథలో కొన్ని కీలకమైన మార్పులు-చేర్పులు సూచించినట్లు టాక్. విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఇన్‌పుట్స్‌తో స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దిన తర్వాత కథ అద్భుతంగా వచ్చిందని తెలుస్తోంది. ఈ సరికొత్త వెర్షన్ చూసి విజయేంద్ర ప్రసాద్ కూడా పూరీని ఎంతగానో అభినందించారట. ఈ మార్పుల వల్ల సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుందని ఇది ఖచ్చితంగా ఒక భారీ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ఒకవైపు పూరీ జగన్నాథ్ మార్క్ రా అండ్ రస్టిక్ టేకింగ్, మరోవైపు విజయేంద్ర ప్రసాద్ లాంటి మాస్టర్ స్టోరీ టెల్లర్ స్క్రిప్ట్ జడ్జిమెంట్.. ఈ రెండు తోడవ్వడంతో ‘స్లమ్‌డాగ్’ చిత్రంపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!