Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన చేతిలో భారీ సినిమాలు ఉండగా, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ గురించి కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దగ్గర పనిచేసిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ అజిత్‌కు భారీ పాన్ ఇండియా కథను వినిపించినట్లు సమాచారం. ఈ కథ అజిత్‌కు బాగా నచ్చిందని, పూర్తి వివరాలతో మరోసారి కథ చెప్పాలని ఆయన కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అజిత్ కుమార్ తన తదుపరి సినిమాపై దృష్టి సారిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘డేర్ డెవిల్’ కోసం ఆయన సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత అజిత్, అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
ఇదిలా ఉండగా, ‘డేర్ డెవిల్’ పూర్తయిన తర్వాత అజిత్ మరోసారి దర్శకుడు వెంకట్ ప్రభుతో చేతులు కలపనున్నారనే వార్తలు కూడా కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘మంకథ’ భారీ విజయాన్ని అందుకోవడంతో, ఈ కాంబినేషన్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఆఫీషియల్ ప్రకటన అయితే వెలువడలేదు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి టీమ్‌కు చెందిన ఓ దర్శకుడు అజిత్‌ను కలిసినట్లు సమాచారం. ఎస్ఎస్ రాజమౌళి వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ఆ దర్శకుడు అజిత్‌కు ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా కథను వినిపించారని తెలుస్తోంది. కథలోని కాన్సెప్ట్, స్కేల్ అజిత్‌కు నచ్చడంతో దానిపై మరింత చర్చించేందుకు ఆయన ఆసక్తి చూపించినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పటికిప్పుడు పట్టాలెక్కే అవకాశం లేదని తెలుస్తోంది. అజిత్ ప్రస్తుతం అంగీకరించిన సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. ‘డేర్ డెవిల్’ తర్వాత వెంకట్ ప్రభుతో సినిమా ఉంటే, ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే రాజమౌళి అసిస్టెంట్ చెప్పిన సినిమా మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఇది ఇప్పటికైతే చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌గానే చూడాలి. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక అజిత్ తన సినిమాలతో పాటు మోటార్‌స్పోర్ట్స్‌పై ఉన్న అభిరుచిని కూడా కొనసాగిస్తున్నారు. ఆయన రేసింగ్ ప్రయాణం ఆధారంగా రూపొందుతున్న ‘గ్లాడియేటర్స్’ అనే డాక్యుమెంటరీలో కూడా కనిపించనున్నారు. ఇది అజిత్ కెరీర్లో తొలి ఓటీటీ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే ‘డేర్ డెవిల్’, వెంకట్ ప్రభుతో కాంబినేషన్, రాజమౌళి టీమ్‌కు చెందిన దర్శకుడితో చర్చలు, ‘గ్లాడియేటర్స్’ వంటి ప్రాజెక్టులతో అజిత్ మరో సారి అభిమానులను అలరించేందుకు సిద్దమవుతున్నారు. అయితే రాజమౌళి శిష్యుడు చెప్పిన ఆ భారీ పాన్ ఇండియా కథకు అజిత్ నిజంగానే గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఈ ప్రాజెక్ట్ ను ఆఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తారు? అనేది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
- Tags
- Ajith Kumar
- cinema
తాజావార్తలు
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!