Rajamouli: ‘మేము ఫేమస్’ నచ్చిందన్న జక్కన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajamouli: టాలీవుడ్.. సినిమా ఏదైనా.. భాషా మనది కాకపోయినా.. నచ్చితే మాత్రం అస్సలు వదిలిపెట్టదు. టాలీవుడ్ స్టార్లు కూడా అంతే.. సినిమా నచ్చితే మనకెందుకు.. నచ్చకపోతే మనకెందుకు అని అనుకోరు. మంచి సినిమాను ఎంకరేజ్ చేయడంలో వారి తరువాతనే ఎవరైనా. ఈ మధ్యనే రిలీజ్ అయిన 2018 మలయాళ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోస్ కూడా ఆ సినిమా బావుందని ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమా కన్నా ముందే రిలీజ్ అయ్యింది మేము ఫేమస్. సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూనే డైరెక్ట్ చేసిన సినిమా. మొదటి నుంచి కూడా ఈ సినిమా ప్రమోషన్స్ అన్ని స్టార్లే చేశారు. సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కు ముందు రోజే సినిమా చాలా బావుందని మహేష్ బాబు ట్వీట్ వేయడంతో అభిమానులు మేము ఫేమస్ కు క్యూ కట్టారు. మొదటి రోజే మంచి టాక్ ను అందుకొని దూసుకెళ్తున్న ఈ సినిమాపై దర్శకధీరుడు రాజమౌళి సైతం ట్వీట్ చేసి షాకిచ్చాడు. తనకు మేము ఫేమస్ సినిమా బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు.
Malaika Arora: మలైకా మీద నెటిజన్స్ ఫైర్..
Also Read
“చాలా కాలం తర్వాత థియేటర్‌లో ఓ సినిమాని బాగా ఎంజాయ్ చేశాను. ఈ అబ్బాయి సుమంత్ కోసంఈ సినిమాను చూడండి. నటుడిగా మరియు దర్శకుడిగా అతనికి మంచి భవిష్యత్తు ఉంది. అన్ని పాత్రలు చక్కగా తీర్చిదిద్దాడు. నటీనటులు చాలాసహజంగా నటించారు. ముఖ్యంగా అంజి మామా. అందరు సినిమా చూసి మీ వాళ్లకు సిఫార్సు చేయండి.. యూత్ ను ఎంకరేజ్ చేయాలే.. ధంధం చేయొద్దు” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక జక్కన్న ట్వీట్ తో మేము ఫేమస్ కు మరింత హైప్ వచ్చిందనే చెప్పాలి. కొన్నిరోజులు ఓటిటీలో చూద్దాంలే అనుకున్నవారు కూడా ఈ ట్వీట్ తో థియేటర్ల బాట పడతారు అని చెప్పడంలో సందేహం లేదు. మరి ఈ సినిమా ముందు ముందు ఎలాంటి కలక్షన్స్ రాబడుతుందో చూడాలి.
After a long time thoroughly enjoyed a film in the theatre. Watch out for this guy Sumanth. He had a bright future both as an actor and director. All the characters were nicely etched and actors performed naturally. Especially Anji mama. Highly recommend it to everyone.
Youth…
— rajamouli ss (@ssrajamouli) May 29, 2023
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..