NTV Telugu Site icon

Mahesh : మహేష్-రాజమౌళి కోసం.. స్టార్ హీరోయిన్..!

Mahesh

Mahesh

 

రాజమౌళి-మహేష్ బాబు ప్రాజెక్ట్‌ అఫీషియల్ అనౌన్స్మెంట్ అతి త్వరలోనే రాబోతోంది. ఈ నేపథ్యంలో.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. అయితే లేటెస్ట్ అప్టేట్ ప్రకారం ఓ స్టార్ హీరోయిన్‌ పేరు వినిపిస్తోంది. ఆ బ్యూటీ గతంలో ప్రభాస్ సరసన రొమాన్స్ చేసినప్పటికీ.. మళ్లీ మరో తెలుగు హీరోతో సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు మహేష్ సరసన దాదాపు ఫిక్స్ అయిపోయిందట.. ఇంతకీ ఎవరా బ్యూటీ..?

ట్రిపుల్ ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత.. మహేష్ బాబుతో మరొక బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి.. కానీ ఇంకా అఫిషీయల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇవ్వలేదు. ఇస్తే మాత్రం హీరోయిన్ ఎవరు.. విలన్‌గా ఎవరు నటించబోతున్నారనే.. విషయాల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఈ లోపే ఫలానా హీరో మహేష్‌కు విలన్‌గా ఫిక్స్ అయ్యాడని.. ఓ స్టార్ హీరోయిన్‌ మహేష్‌తో రొమాన్స్ చేయబోతోందనే వార్తలు వినిపిస్తునే ఉన్నాయి. ఇలాంటి రూమర్స్‌లో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. వింటానికి మాత్రం అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్‌ను తీసుకునేందుకు రాజమౌళి ట్రై చేస్తున్నట్టు వినిపిస్తోంది. కమల్ కాకపోయినా.. ఓ స్టార్ హీరోని మాత్రం విలన్‌గా తీసుకోవడం పక్కా అని తెలుస్తోంది.

ఇక ఇంత పెద్ద సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంలో కూడా రకరకాల ఊహాగానలొస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళి కొంతమంది హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అందులోభాగంగా.. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ లైన్లో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ బ్యూటీ ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత మరో తెలుగు ప్రాజెక్ట్ చేయలేదు శ్రద్దా కపూర్. అయితే ఇప్పుడు రాజమౌళి సినిమాలో ఛాన్స్ అంటే మాత్రం వదులుకునే ఛాన్స్ లేదు. అయితే ఇలాంటి వార్తల్లో క్లారిటీ రావాలంటే మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే.

Show comments