Site icon NTV Telugu

Rajamouli : ఏపీలో కొత్త జీవోపై స్పందన… కేసీఆర్‌ కు స్పెషల్ థ్యాంక్స్

Rajamouli

చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు గాను సినీ పరిశ్రమ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే దర్శక ధీరుడు రాజమౌళి ఈ విషయం మీద కాస్త ఆలస్యంగా స్పందించారు. కొత్త G.Oలో సవరించిన టిక్కెట్ ధరల ద్వారా తెలుగు సినిమాకి సహాయం చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పేర్నినాని గారికి ధన్యవాదాలు. ఈ జీవో సినిమా పరిశ్రమ మళ్లీ మునుపటిలా పుంజుకోవడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

Read Also : AP Govt new G.O : కొత్త జీవోపై మహేష్ బాబు రియాక్షన్

అలాగే “పెద్ద సినిమాలకు రోజుకు 5 షోలను అనుమతించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు” అని చెబుతూ ఆయన మరో ట్వీట్ చేశారు. “మాకు నిరంతరం సహకరిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు” అని రాజమౌళి పేర్కొన్నారు. ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే… ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” సినిమా అనేక వాయిదాల అనంతరం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత రాజమౌళి మహేష్ బాబు హీరోగా మరో సినిమా ప్రారంభించనున్నారు.

Exit mobile version