తెలుగు చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తీసిన సినిమాలు అద్భుతం.. ఆ సినిమాల రికార్డులు కొల్లగొట్టడం ఎవరికి సాధ్యం కానీ పని. మగధీర, బాహుబలి లాంటి సినిమాలు చరిత్రలో నిలబడపోయేలా చిత్రీకరించిన ఘనత జక్కన్న కే దక్కుతోంది. ఇక ఈ సినిమాల లిస్ట్ లో మరికొన్ని రోజుల్లో ఆర్ఆర్ఆర్ కూడా జాయిన్ కాబోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు.
ప్రమోషన్స్ లో భాగంగా జక్కన్న నేడు బిగ్ బాస్ ఫైనల్స్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్ స్టేజీపై నాగ్ తో సందడి చేశాడు. జక్కన్న స్టేజి మీదకు రాగానే “రాజమౌళి గారు.. మీ పేరులో ముందు ఉన్న ఎస్ఎస్ అంటే అర్థం ఏంటీ..?” అంటూ నాగ్ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా రాజమౌళి ” నిజానికి ఎస్ఎస్ అంటే శ్రీశైల శ్రీ రాజమౌళి అంతే. కానీ.. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే మాత్రం సక్సెస్, స్టుపిడ్ అంటారు.” అని చెప్పుకొచ్చాడు. ఇక వెంటనే నాగ్ సక్సెస్ ఒప్పుకొంటాను కానీ స్టుపిడ్ అంటే ఒప్పుకొను అంటూ నవ్వులు చిందించారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ నెట్టింట వైరల్ గా మారింది.