Site icon NTV Telugu

SS Rajamouli : ప్రభాస్ ను అలాంటి బట్టల్లో చూసి షాక్ అయ్యా.. రాజమౌళి కామెంట్స్

Ss Rajamouli

Ss Rajamouli

SS Rajamouli : బాహుబలి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది ఆ మూవీ. రీసెంట్ గానే రెండు పార్టులను కలిపి ది ఎపిక్ పేరుతో తీసుకొచ్చారు. అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సందర్భంగా రాజమౌళి రాజమౌళి ఈ మూవీ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రభాస్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని గుర్తు చేసుకున్నారు. “బాహుబలి షూటింగ్ సమయంలో ప్రభాస్, రానా, అనుష్క – ఈ ముగ్గురూ రాత్రంతా నాన్ స్టాప్‌గా ప్రాక్టీస్‌ చేశారు.

Read Also : Prabhas : ప్రభాస్ పై హీరోయిన్ సంచలన కామెంట్స్.. అలా చేస్తాడంటూ..

ఒక్క నిమిషం కూడా విరామం లేకుండా యాక్షన్ సీన్లు, ట్రైనింగ్ సెషన్ చేశారు. ఉదయాన్నే నేను సెట్‌కు వెళ్లినప్పుడు ప్రభాస్‌ను చూసి షాక్‌ అయ్యాను. ఆయన బట్టలు చిరిగిపోయాయి. ఓ యాక్షన్ సీన్ కోసం ఎక్కువ ప్రాక్టీస్ చేయడంతో బట్టలు అలా అయ్యాయి. చాలా అలసిపోయి ఉన్నాడు. కానీ కళ్లలో మాత్రం ఫైర్ ఉంది. అనుష్క, రానా కూడా అంతే కష్టపడ్డారు. వాళ్లంతా అలాంటి డెడికేషన్ తో పనిచేశారు కాబట్టే సినిమా అంత బాగా వచ్చింది. ప్రభాస్ అంతటి స్టార్ అవడానికి ఎంత కష్టపడుతాడో నాకు బాగా తెలుసు అని రాజమౌళి తెలిపారు.

Read Also : Vishnu Priya : డబ్బు కోసం ఆ ఇంటికి వెళ్లి తప్పు చేశా..

Exit mobile version