Site icon NTV Telugu

Rajamouli : సైనికుల కదలికల గురించి పోస్టు చేయొద్దు.. రాజమౌళి రిక్వెస్ట్

Rajamouli

Rajamouli

Rajamouli : ఇండియా-పాకిస్థాన్ యుద్ధ వాతావరణం ఇంకా పెరుగుతోంది. పాక్ కవ్వింపు చర్యలకు ఇండియన్ ఆర్మీ ధీటైన సమాధానం ఇస్తోంది. నిన్న రాత్రి డ్రోన్ దాడులకు దాయాది పాక్ తెగించింది. కానీ ఇండియన్ ఆర్మీ ధీటుగా జవాబిచ్చింది. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను కుప్ప కూల్చేసింది మన ఆర్మీ. రాత్రంతా పాకిస్థాన్ దాడులను తిప్పి కొడుతూనే.. పాక్ కు గట్టి బుద్ధి చెప్పింది. పాక్ లోని ప్రముఖ పోర్టులు, డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసి ఇండియన్ ఆర్మీ సత్తా చాటింది. ఈ క్రమంలోనే మన ఇండియన్ ఆర్మీకి సెలబ్రిటీలు అందరూ మద్దతు తెలుపుతున్నారు. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా మన ఆర్మీకి సపోర్టు చేశారు.
Read Also : Allu Aravind : సింగిల్ సినిమా వసూళ్లలో కొంత భాగం సైనికులకు

‘మన ఇండియన్ ఆర్మీకి అందరం మద్దతుగా ఉండాలి. ఈ సమయంలో ఎవరైనా సైనికుల కదలికలు, వాళ్ల చర్యలు చూస్తే ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో పోస్టులు చేయొద్దు. అలా చేస్తే పాకిస్థాన్ కు సాయం చేసినట్టు అవుతుంది. వాళ్లకు ఆ ఛాన్స్ ఇవ్వొద్దు. సోషల్ మీడియాలో ఎలాంటి ఫేక్ ప్రచారాలు చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు’ అంటూ రాసుకొచ్చారు రాజమౌళి. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈయనతో పాటు స్టార్ హీరోలు కూడా ఇండియన్ ఆర్మీకి మద్దతు తెలుపుతున్నారు.
Read Also : India Pakistan War: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య, రక్షణ మంత్రిత్వ శాఖ సంచలన ఆదేశాలు..

Exit mobile version