SSMB 29 : రాజమౌళి తీసే సినిమాలపై ఎన్ని ప్రశంసలు ఉంటాయో.. అదే విధంగా కొన్ని ట్రోల్స్ కూడా ఉంటాయి. ఆయన సినిమా నుంచి ఏదైనా లుక్ రిలీజ్ అయిందంటే చాలు.. ఆ లుక్ పలానా సినిమా నుంచి కాపీ కొట్టాడని సదరు ఫొటోలతో పోలుస్తూ పోస్టులు పెట్టేస్తారు. ఇక జక్కన్న సినిమా రిలీజ్ అయ్యాక.. అందులోని సీన్లు పలానా మూవీ నుంచి కొట్టేశాడని.. ఆ సినిమా సీన్ ను ను చూసి దీన్ని డిజైన్ చేశాడంటూ రకరకాల ట్రోల్స్, మీమ్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ అవన్నీ జక్కన్న సినిమాపై ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించవు. రికార్డులు బద్దలైపోవడం, చరిత్ర తిరగరాయడం మాత్రమే జక్కన్న సినిమాలతో మనకు కనిపిస్తాయి.
Read Also : Peddi : చికిరి పాటపై చరణ్ ఫ్యాన్స్ అసంతృప్తి.. మిక్స్ డ్ టాక్
ఇక తాజాగా రిలీజ్ అయిన మహేశ్ బాబు మూవీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ రిలీజ్ అయింది. ఈ లుక్ చూసిన నెటిజన్లు సూర్య 24 మూవీలో వీల్ చైర్ లో కూర్చున్నట్టే ఉందంటున్నారు. అలాగే పృథ్వీరాజ్ బ్యాక్ గ్రౌండ్ లో రోబో హ్యాండ్స్ క్రిష్ 3 సినిమాలో వివేక్ ఒబెరాయ్ లుక్ను పోలినట్టే ఉన్నాయని.. సూర్య, వివేక్ ఒబెరాయ్ లుక్స్ ను మిక్స్ చేసి పృథ్వీరాజ్ లుక్ ను రిలీజ్ చేశాడేమో అంటున్నారు. రాజమౌళి ఎన్నడూ ఇలాంటి ట్రోల్స్ కు పెద్దగా స్పందించరు. తన పని తాను చేసుకుంటూ వెళ్తారు. మరి ఈ సారి కూడా మూవీ హిట్ తో ట్రోల్స్ కు ఆన్సర్ చెప్తారా లేదా చూడాలి.
Read Also : Chiranjeevi : పవన్ కల్యాణ్ ను ఆ కారణంతోనే అందరూ ఇష్టపడతారు.. చిరు ఎమోషనల్