Site icon NTV Telugu

SSMB 29 : ఫస్ట్ టైమ్ అలాంటి పని చేస్తున్న జక్కన్న.. మహేశ్ ఫ్యాన్స్ టెన్షన్

Ssmb 29 (2)

Ssmb 29 (2)

SSMB 29 : రాజమౌళి ఎక్కువగా తనకు కలిసొచ్చిన యాంగిల్ లోనే సినిమాలు చేసుకుంటూ పోతాడు. కొత్తగా ప్రయోగాలు చేయడం ఇప్పటి వరకు చూడలేదు. మరీ ముఖ్యంగా ఆయన సినిమాలు చూస్తే.. ఓ స్టూడెంట్ల నెంబర్ వన్, సై, విక్రమార్కుడు, బాహుబలి, త్రిబుల్ లాంటి కథలే కనిపిస్తాయి. అంటే ఇందులో ఎక్కడా టెక్నాలనీ బేస్డ్ గా సినిమా కనిపించదు. ఆయన సినిమాల్లో కథా బలమే కనిపిస్తుంది. బలమైన ఎమోషన్, కళ్లు చెదిరే యాక్షన్, కథలో కొత్తదనం మాత్రమే మనకు కనిపిస్తాయి. ఒక ప్రేక్షకుడికి అందులోనూ తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి కథలు, ఎమోషన్స్, యాక్షన్ నచ్చుతాయో వాటినే హైలెట్ చేస్తాడు జక్కన్న. అదే ఆయన స్పెషాలిటీ. అయితే ఇప్పుడు మహేశ్ బాబుతో తీయబోతున్న సినిమాలో ఫస్ట్ టైమ్ టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్నట్టు కనిపిస్తోంది.

Read Also : The Girlfriend : ‘నీకేం తెలుసు’ అని అమ్మాయిలను అవమానిస్తారు.. రష్మిక కామెంట్స్

తాజాగా మూవీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ మూవీ నుంచి ఓ పోస్టర్ రిలీజ్ కావడం ఇదే ఫస్ట్ టైమ్. ఇందులో ఆయన కుర్చీ తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ కుర్చీ నార్మల్ గా లేదు. అది ఒక రకమైన మిషిన్ లాగా కనిపిస్తోంది. ఆ కుర్చీ పృథ్వీరాజ్ ఆయుధంలా కనిపిస్తోంది. దాన్ని ఉపయోగించి పృథ్వీరాజ్ ఏం చేస్తాడనేది చూపించబోతున్నాడు జక్కన్న. మనుషుల ప్రాణాలు తీయగలిగేలా హాలీవుడ్ లో ఇలాంటి మెషీన్లు ఉంటాయి. ఇప్పుడు ఇదే వాడుతున్నాడు రాజమౌళి. తనకు అలవాటు లేని ఇలాంటి టెక్నాలజీని జక్కన్న అప్లై చేయడంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఇప్పటి వరకు జక్కన్న ఓ మగధీర, బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి బలమైన కథలతో సినిమాలు తీసి.. మహేశ్ బాబుతో ఇలాంటి ప్రయోగం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జక్కన్న టేకింగ్, మేకింగ్ పై అందరికీ నమ్మకం ఉన్నా.. ఆయనకు అలవాటు టేని టెక్నాలజీని ఎంచుకోవడంపై బాబు ఫ్యాన్స్ కొంత ఆందోళన చెందుతున్నారు.

Read Also : Shree Charani: ఇది మొదటి అడుగు మాత్రమే.. ముందు చాలా ఉంది!

Exit mobile version