Site icon NTV Telugu

Ranbir- Alia: అలియా భట్ పెళ్ళి పార్టీలో ‘ఆర్ఆర్ఆర్’ సందడి?

Alia Ranbir

Alia Ranbir

‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్ ఈ నెల 14న ఓ ఇంటిది కాబోతోంది. బాలీవుడ్ స్టార్ రణ్‌ బీర్ కపూర్ తో ఆలియాభట్ వివాహం ఓ ప్రైవేట్ వేడుకలా జరగనుంది. అయితే ఆ తర్వాత నాలుగు రోజులకు ముంబైలోని తాజ్ హోటల్స్ లో బాలీవుడ్ ప్రముఖులతో పాటు ముఖ్యమైన అతిథులకు భారీ స్థాయిలో పార్టీ ఇవ్వబోతోందీ జంట. ఈ వేడుకకు ‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఫ్యామిలీలతో హాజరుకాబోతున్నట్లు సమాచారం. దీనికోసం సొంతంగా ఓ ఛార్టర్డ్ ఫ్లైట్ కూడా బుక్ చేసుకున్నారట. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ ప్రచారంలో ఆలియాభట్ లేకపోడవడంతో తన పాత్ర చిన్నది కావటం వల్లే డుమ్మాకొట్టిందనే రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అయితే వాటిని అలియా ఖండించింది. మరి ఆలియా పార్టీలో ‘ఆర్ఆర్ఆర్’ తారలు ఎలాంటి రచ్చ చేస్తారో చూడాలి.

Exit mobile version