Site icon NTV Telugu

Baahubali The Epic : కీలక సన్నివేశాలు లేపేసిన జక్కన్న.. ఇది నీకు న్యాయమా..

Baahubali – The Epic

Baahubali – The Epic

Baahubali The Epic : రాజమౌళి చెక్కిన హిస్టారికల్ మూవీ బాహుబలి. ప్రభాస్ హీరోగా రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ మూవీ. పదేళ్ల తర్వాత దాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. రెండు పార్టులను కలిపి ఒకే సినిమాగా అక్టోబర్ 31న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. రెండు పార్టుల్లో ఏది కట్ చేస్తారో అనే టెన్షన్ ఇటు అభిమానుల్లో ఉంది. దీనిపై తాజాగా రాజమౌళి హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. రెండు సినిమాల్లోని సీన్లు, పాటలు నాకు చాలా ఇష్టం. కానీ ఎడిటింగ్ చేయకుండా రిలీజ్ చేయలేం. అందుకే కొన్ని సీన్లు, పాటలను తీసేయాలని నిర్ణయించాం.

Read Also : Ritika Nayak : శ్రీలీల, మీనాక్షిని టెన్షన్ పెడుతున్న కొత్త హీరోయిన్..

ప్రభాస్, తమన్నా మధ్య రొమాంటిక్ సీన్లు, కన్నా నిదురించరా పాటను తీసేయాలని అనుకున్నట్టు తెలిపారు. ఈ కామెంట్స్ ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేస్తున్నాయి. ఎందుకంటే తమన్నా, ప్రభాస్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లకు మంచి క్రేజ్ ఉంది. సినిమాకు గ్లామర్ టచ్ ఇచ్చే సీన్లు కూడా అవే. అలాంటి సీన్లు తీసేయడం ఏంటి జక్కన్నా అంటున్నారు అభిమానులు. ఇవే కాకుండా ఇంకా చాలా సీన్లు ఎడిటింగ్ లో లేపేస్తున్నాడంట జక్కన్న. రెండు పార్టులు కలిసి 5 గంటల 27 నిమిషాల రన్‌టైమ్‌ ఉంది. ఇందులో రెండు గంటల వరకు ఎడిటింగ్ లో తీసేస్తున్నారంట. అంటే సగం పార్టు లేపేస్తారన్నమాట. మరి ఏ సీన్లు తీసేస్తాడో.. వేటిని ఉంచుతాడో చూడాలి.

Read Also : Pawan Kalyan : మొన్న విజయ్.. నేడు బాలయ్య.. పవన్ కు పోటీనే లేదా..?

Exit mobile version