Rajamouli : టాలీవుడ్‌లో సక్సెస్‌కి మరో పేరు రాజమౌళి. ఆయన తీసిన ప్రతి సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు, క్రేజ్ క్రియేట్ చేస్తుంది. కానీ ఆయన సినిమాలు ఎంత పెద్ద స్థాయిలో హిట్ అయినా సరే, సోషల్ మీడియాలో ఒక కామన్ ట్రెండ్ కనిపిస్తుంది రాజమౌళి సినిమాలపైనే ఎక్కువగా కాపీ కొట్టాడు అనే ట్రోల్స్ వస్తుంటాయి. ఆయన సినిమాల నుంచి లుక్, సీన్లు వస్తే ఇతర సినిమాలతో పోలుస్తారు. ఇతర డైరెక్టర్ల సినిమాలపై ఇలాంటి ఆరోపణలు తక్కువగానే వస్తాయి. అయితే రాజమౌళి సినిమాల విషయంలో మాత్రం ఎందుకింత ఎక్కువగా జరుగుతోంది? దీనికి ఒక ప్రధాన కారణం ఉంది.
Read Also : Raviteja : రేపే రవితేజ కొత్త మూవీ టైటిల్, ఫస్ట్ లుక్
ఆయన సినిమాలు సాధారణ స్థాయిలో ఉండవు. , ఎమోషన్స్, కొత్త కాన్సెప్ట్‌లతో రాజమౌళి సినిమాలు ఎవరి ఊహలకు అందనంత రేంజ్ లో ఉంటాయి. ఆయన సినిమా ఎలా ఉంటుందో రిలీజ్ అయ్యేదాకా ఎవరూ ఊహించలేరు. అందుకే ఆయన సినిమాల పోస్టర్లు, సీన్లకు పోలికలు వెతకుతుంటారు. రాజమౌళి సినిమాలు విడుదలకాకముందే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. ట్రైలర్, పోస్టర్, లుక్ వచ్చిన వెంటనే నెటిజన్లు వాటిని హాలీవుడ్ లేదా ఇతర భాషా సినిమాలతో పోల్చేస్తారు. ఏ చిన్న సీన్ చూసినా “ఇది ఆ సినిమా లాగుంది” అంటూ కాపీ ట్యాగ్ వేస్తారు. కానీ ఇవేవీ రాజమౌళి సినిమాల మీద ఎఫెక్ట్ చూపించవు.
Read Also : Samantha – Rashmika : ఫ్యాన్స్ తో ఆటలాడుతున్న రష్మిక, సమంత.. ఎందుకిలా..?