“రాధే శ్యామ్” ప్రమోషన్స్‌లో సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ రాజమౌళి కూడా భాగమైన విషయం తెలిసిందే. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘రాధేశ్యామ్’ గురించి రాజమౌళి, ప్రభాస్ మధ్య జరిగిన ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పనులు ఉన్నప్పటికీ ‘రాధే శ్యామ్’ని ప్రమోట్ చేయడానికి సమయం కేటాయించినందుకు రాజమౌళికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభాస్ ఇంటర్వ్యూను ప్రారంభించాడు. ‘బాహుబలి’ ప్రమోషన్స్ టైమ్‌ని ప్రభాస్‌కి గుర్తు చేస్తూ… ప్రభాస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి చాలా సిగ్గుపడేవాడని, కానీ ఇప్పుడు ఇతరుల కోసం అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాడని రాజమౌళి చెప్పాడు.
Read Also : Radheshyam : థియేటర్ వద్ద అపశృతి… ప్రభాస్ ఫ్యాన్స్ కు తీవ్ర గాయాలు
ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాజమౌళిని ప్రభాస్ ఒక సూటి ప్రశ్న అడిగాడు. ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్స్ తో ‘ఆర్ఆర్ఆర్’ అనే భారీ సినిమా తీస్తున్నారు. అందులో కనీసం నాకు గెస్ట్ రోల్ ఇవ్వాలనిపించలేదా ? అసలు మీ విజన్ లో నేను ఎక్కడా కనిపించలేదా ? అని ప్రశ్నించాడు. దీనికి రాజమౌళి “నువ్వు పెద్ద షిప్ వంటివాడివి. ఆ షిప్ ని పెడితే గ్రాండ్ గా కన్పిస్తుంది అన్పిస్తే పెడతాం” అని అన్నారు. “మీరు కావాలనుకుంటే షిప్ ను తయారు చేస్తారు ?” అని ప్రభాస్ అనగా, “అడిగితే ప్రభాస్ వస్తాడు కదా అని పెడితే సినిమా బాగుండదు. ఒకవేళ అవసరమైతే నేనే ఎలాగైనా కన్విన్స్ చేసి తీస్తుకొస్తాను” అన్నారు. అయితే “ఎన్టీఆర్, చరణ్ అంటేనే మీకు ఇష్టం నాకంటే” అని అన్నారు.