చోరుడికి రాజ మార్గం! శ్రీవిష్ణు ఆనందోత్సాహం!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచి కంటెట్‌తో ఫీల్‌గుడ్ సినిమాలను అందించే హీరోగా శ్రీవిష్ణు ప్రేక్షకుల మదిలో నిలిచారు. అప్పట్లో ఒకడుండే వాడు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చిత్రాలతో తనకంటూ టాలీవుడ్లో ఓ మార్కెట్‌ను ఎస్టాబ్లిష్ చేసుకొన్నారు. యావరేజ్ నుంచి మినిమమ్ గ్యారెంటీ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకొన్నారు శ్రీవిష్ణు.. ఆయన ఇటీవలే నటించిన ‘రాజ రాజ చోర’ చిత్రం నేటికీ 30 రోజులు పూర్తిచేసుకొంది. ఈ సందర్బంగా చోరుడికి రాజ మార్గం!… అంటూ శ్రీవిష్ణు ఆనందం వ్యక్తం చేశారు.
అయితే సెకండ్ లాక్ డౌన్ తరువాత వచ్చిన చిత్రాల్లో ‘రాజ రాజ చోర’ నెల రోజులుగా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండటమంటే విశేషమేనని చెప్పాలి. మొదటి నుంచి ఈ సినిమా మీద ప్రేక్షకులకు అంచనాలు ఏర్పడటంతో పాటుగా, పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్స్ రాబట్టుకొంది. గాలిసంపత్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత శ్రీవిష్ణు వెంటనే కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఈ చిత్రానికి దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వం వహించగా.. అభిషేక్ అగర్వాల్, టి జీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. మేఘా ఆకాష్, సునైనా, రవి బాబు, తనికెళ్ళ భరణి, శ్రీకాంత్ అయ్యాంగర్ తదితర పాత్రల్లో నటించారు.
Also Read

తాజావార్తలు
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
-
Splitsvilla: ‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’: జియోహాట్‌స్టార్ తెలుగులో ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా X6’ స్ట్రీమింగ్!
-
Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
-
He-Man: ‘హీ-మ్యాన్’గా యంగ్ హీరో నిఖిల్.. దద్దరిల్లుతున్న ట్రైలర్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!