Break Out: బ్రహ్మానందం తనయుడికి బన్నీ దన్ను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం పెద్ద కుమారుడు రాజా గౌతమ్ ‘పల్లకిలో పెళ్ళికూతురు’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండీ అడపా దడపా హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ విజయలక్ష్మి మాత్రం వరించడం లేదు. బట్… రొటీన్ కు భిన్నమైన సినిమాలు చేస్తూ, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడం కోసం రాజా గౌతమ్ ప్రయత్నిస్తుండటం అభినందించదగ్గదే. తాజాగా రాజా గౌతమ్ హీరోగా సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో అనిల్ మోదుగ ‘బ్రేక్ అవుట్’ పేరుతో ఓ సినిమాను నిర్మించారు. బాలకృష్ణ కొండూరి, శ్రీనివాస్ వన్నియాకుల దీనికి సహ నిర్మాతలు.

Also Read
- Wamika Gabbi : 'DC'తో తమిళ్లో మొదటి సూపర్ హిట్ అందుకున్న వామికా
- Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
- Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్‌కు 51 ఏళ్లు
- South Stars Mumbai Homes : సౌత్ స్టార్స్‌కు సెకండ్ హోమ్‌గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
‘బ్రేక్ అవుట్’ మూవీ ట్రైలర్ ను సోమవారం సాయంత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆవిష్కరించారు. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ చక్కని విజయాన్ని సాధించాలనే ఆకాంక్షను బన్నీ వ్యక్తం చేశారు. ‘ఈ సినిమా ట్రైలర్ ను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని, సినిమా కాన్సెప్ట్ ఆసక్తిని కలిగిస్తోందని, తెలుగు సినిమా రంగంలో ఇలాంటి ప్రయోగాత్మక కథలను యువకులు ప్రయత్నించడం హర్షించదగ్గద’ని అల్లు అర్జున్ అన్నారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ‘బ్రేక్ అవుట్’ మూవీ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. ఒంటరిగా ఉండటానికి భయపడే ఓ యువకుడు అనుకోని పరిస్థితుల్లో గ్యారేజ్ లో ఇరుక్కుపోతే ఏం జరిగింది? దాని పర్యవసానాలు ఏమిటనేదీ ఈ చిత్ర కథ అని ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. కిరీటి దామరాజు, ‘చిత్రం’ శ్రీను, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి, రమణ భార్గవ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
Wamika Gabbi : ‘DC’తో తమిళ్లో మొదటి సూపర్ హిట్ అందుకున్న వామికా
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
-
Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. “డ్రైవర్‌నే చంపుకోండి” అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
-
Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!