Raj Tarun: ‘పురుషోత్తముడు’గా రానున్న రాజ్ తరుణ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అలాగ వచ్చి, ఇలాగ మెప్పించి, ఎలాగైనా ఒప్పిస్తూ సాగుతున్న రాజ్ తరుణ్ ఆరంభంలో భలేగా అలరించాడు. అందుకు తగ్గట్టుగానే విజయాలూ రాజ్ తరుణ్ ను వరించాయి. ఎందుకనో కొంతకాలంగా రాజ్ తరుణ్ కు విజయం మొహం చాటేసింది. అయినా రాజ్ తరుణ్ కు అవకాశాలు వస్తున్నాయంటే, అతని ప్రతిభపై సినీజనానికి నమ్మకం ఉందని చెప్పవచ్చు. ఈ మధ్యే రాజ్ తరుణ్ హీరోగా ‘పురుషోత్తముడు’ అనే చిత్రం మొదలయింది. దాంతో పాటు మరో రెండు ప్రాజెక్టులనూ రాజ్ తరుణ్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో రాజ్ రాబోయే చిత్రాలపై సినీజనాల్లో ఒకింత ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు.
రాజ్ తరుణ్ 1992 మే 11న విశాఖపట్నంలోని ప్రహ్లాద పురంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచీ చలాకీగా ఉంటూ చుట్టూ ఉండేవారిని తన మాటలతోనూ, చేతలతోనూ ఆకట్టుకొనేవాడు రాజ్ తరుణ్. ఈ నేపథ్యంలోనే అతనిలో సినిమాలపై ఆసక్తి నెలకొంది. చూడగానే పక్కింటి కుర్రాడికి మల్లే ఉంటాడు రాజ్ తరుణ్. అదే అతనికి ఎస్సెట్ అనీ చెప్పొచ్చు. అనేక లఘు చిత్రాల్లో నటించిన రాజ్ తరుణ్ కు దర్శకుడు కావాలన్నది అభిలాష. ఆ కోరికతోనే చిత్రసీమలో అడుగు పెట్టాడు.’ఉయ్యాల జంపాల’ చిత్రానికి స్టోరీ, డైరెక్షన్ డిపార్ట్ మెంట్స్ లో వర్క్ చేయసాగాడు. ఆ సమయంలోనే ఆ చిత్ర దర్శకుడు విరించి వర్మ సినిమాలో హీరో కేరెక్టర్ కు రాజ్ తరుణ్ అయితే బాగుంటుందని భావించాడు. అలా కోరుకోకుండానే ‘ఉయ్యాల జంపాల’ హీరో అయిపోయాడు రాజ్ తరుణ్. ఇది చాలా చిన్న సినిమా. కానీ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి సురేశ్ బాబు వంటి పెద్దవారు ఈ చిత్రం రూపకల్పన వెనుక ఉన్నారు. వీరికి తోడు పి.రామ్మోహన్ కూడా సినిమాకు భాగస్వామి. అవికా గోర్ నాయికగా నటించిన ‘ఉయ్యాల జంపాల’ మంచి విజయం సాధించింది. దాంతో రాజ్ తరుణ్ నటునిగా బిజీ అయిపోయాడు.
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
‘ఉయ్యాల జంపాల’ తరువాతి చిత్రం ‘సినిమా చూపిస్త మావ’లోనూ అవికా గోర్ తో జోడీ కట్టాడు రాజ్ తరుణ్. మరో హిట్టు పట్టాడు. ఆపై ‘కుమారి 21 ఎఫ్’లోనూ హీరోగా నటించాడు. అదీ సక్సెస్ చూసింది. ఇలా వరుస విజయాలు చూసిన రాజ్ తరుణ్ కాల్ షీట్స్ కోసం జనం రావడం మొదలెట్టారు. “సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, ఈడో రకం ఆడో రకం, కిట్టూ ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, రంగుల రాట్నం, రాజుగాడు, లవర్, ఇద్దరి లోకం ఒకటే” వంటి చిత్రాల్లో నటించేశాడు రాజ్ తరుణ్. కొన్ని తీపి రుచి చూపిస్తే, మరికొన్ని చేదు అనుభవం మిగిల్చాయి.
రాజ్ తరుణ్ లో మంచి రచయిత కూడా ఉన్నాడు. అసలు దానిని నమ్ముకొనే కదా, చిత్రసీమలో అడుగు పెట్టింది. అందువల్ల రాజ్ తరుణ్ లోని రచయిత ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’లో “జానీ జానీ ఎస్ పప్పా…” సాంగ్ రాసేశాడు. తరువాత ‘రంగుల రాట్నం’లో “ప్రేమ ప్రేమా…” అనే పాటనూ పలికించాడు. ఇలా తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాలని తపిస్తున్న రాజ్ తరుణ్ సక్సెస్ రేటు నెమ్మదించింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన కొన్ని చిత్రాలు ముందుగా ఓటీటీలో వెలుగు చూశాకే థియేటర్లలో కనిపించాయి. అయినప్పటికీ మునుపటి విజయం అతని దరి చేరడం లేదు. రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన ‘స్టాండప్ రాహుల్’ వెలుగు చూసి యేడాది దాటింది. రాబోయే ‘పురుషోత్తముడు’పైనే రాజ్ తరుణ్ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సారి ఏ తీరున అలరిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!