టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజాగా “స్టాండప్ రాహుల్” అనే చిత్రంతో వస్తున్నాడు. సాంటో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్స్ పై నంద్ కుమార్ అబ్బినేని భరత్ మాగులూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన వర్ష బొల్లమ్మ నటిస్తుంది. తాజాగా సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేసిన మేకర్స్ రాజ్ తరుణ్, వర్ష మధ్య జరిగిన ఫన్నీ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అందులో రాజ్ తరుణ్ హీరోయిన్ ని తన హైట్, వెయిట్, పెళ్లి, ప్రెగ్నెంట్ వంటి పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. ఇక ప్రెగ్నెంట్ గురించి వర్షను ప్రశ్నించగా, “బుగ్గలు లావుగా ఉంటే ప్రెగ్నెంట్ ఉన్నట్టు కాదు” అంటూ సమాధానం ఇచ్చింది. వీరిద్దరి మధ్య జరిగిన ఫన్నీ కాన్వర్జేషన్ ఏంటో ఈ వీడియోలో వీక్షిద్దాం.
Read Also : Vikram Release Date : మేకింగ్ వీడియోతో అనౌన్స్మెంట్