Site icon NTV Telugu

Samantha : సమంతపై రాజ్ నిడుమోరు ఆసక్తికర కామెంట్స్

Samantha

Samantha

Samantha : భారీగా అభిమానులను సొంతం చేసుకున్న ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ మూడో సీజన్ విడుదలకు సిద్ధమవుతోంది. రాజ్–డీకే రూపొందించిన ఈ యాక్షన్ స్పై డ్రామా నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుండటంతో ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా, దర్శకుడు రాజ్ నిడుమోరు ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత, నిమ్రత్ కౌర్ నటన గురించి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

Read Also : Varanasi : వారణాసికి డబ్బింగ్ చెప్పడంపై ప్రియాంక చోప్రా క్లారిటీ

“ఈ సిరీస్ కోసం రాసిన పాత్రలు మొదట ఎవరికీ అనుగుణంగా రాయలేదు. కాని సమంత అయినా, నిమ్రత్ కౌర్ అయినా తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. వాళ్ల పాత్రలు ఈజీగా చేయొచ్చు. అయినా సరే వాళ్లు అందులో కష్టపడి జీవించేశారు. పాత్రలో నటించేది పురుషుడైనా, మహిళైనా అని నేను ఎప్పుడూ పట్టించుకోను. నా దృష్టిలో ఇద్దరూ సమానమే. స్క్రిప్ట్ డిమాండ్ ఏంటో అదే ఫాలో అవుతాను అంటూ తెలిపాడు రాజ్ నిడుమోరు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : Sai Pallavi : హిట్ ఇచ్చిన హీరోతో సాయిపల్లవి మరో సినిమా..?

Exit mobile version