Rahul Ravindran: అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు హీరోగా పరిచయమయ్యాడు రాహుల్ రవీంద్రన్. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో తరువాత మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఆ సమయంలోనే సింగర్ చిన్మయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అనంతరం చిలసౌ అనే చిత్రానికి దర్శకత్వం వహించి మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డును అందుకున్నాడు. ఇక ఆ తరువాత నాగార్జునతో మన్మధుడు 2 సినిమా తీసి డిజాస్టర్ డైరెక్టర్ గా మారాడు. దీని తరువాత డైరెక్షన్ కు గ్యాప్ ఇచ్చి.. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. తాజాగా గుంటూరు కారం సినిమాలో ఒక పాత్రలో కనిపించాడు. రాజగోపాల్ పాత్రలో రాహుల్ కనిపించాడు. అతడిని లీడర్ గా చేయడానికి రమ్యకృష్ణ కుటుంబం ఎంతో కష్టపడుతూ ఉంటుంది. అయితే చివరి వరకు కూడా ఈ రాజగోపాల్ ఎవరి కొడుకు అనేది రివీల్ చేయలేదు. దీంతో అందరూ.. గుంటూరు కారంలో రాహుల్ ఎవరి కొడుకు అని ప్రశ్నలు అడుగుతున్నారు.
ఇకపోతే తాజాగా ఈ ప్రశ్నకు రాహుల్ సమాధానమిచ్చాడు. “అందరూ నన్ను ఇలా అడుగుతూనే ఉన్నారు… నాకు కూడా తెలియలేదు. కానీ, ఆ షూటింగ్ రోజున నేను ఆలోచిస్తూనే ఉన్నాను… అక్కడ స్పిన్ అయ్యే అవకాశం ఉంది. సినిమా సంఘటనల తర్వాత రావు రమేష్‌గారికి మరియు నా పాత్రకు ఏమి జరుగుతుంది అనే దాని గురించి. ఒక ప్రత్యేకమైన తండ్రీకొడుకులు సినిమా కోసం తయారచేశారు. అక్కడ డైనమైట్ డ్రామా ఉంటుంది… ‘రేచెల్ పెళ్లి చేసుకోవడం’ వంటి బిటర్‌స్వీట్ డ్రామా లేదా ‘సైడ్‌వేస్’ వంటి కామెడీ కూడా ఉంటుంది. లేదా ఫైండింగ్ నెమో వంటి సాహస చిత్రం, అక్కడ అతను నన్ను కనుగొనడంలో నాకు సహాయం చేస్తాడు. తల్లిదండ్రులు కానీ మేము బంధాన్ని అలా ముగించాము” అని తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం రాహుల్.. రష్మిక హీరోయిన్ గా గర్ల్ ఫ్రెండ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో రాహుల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.