ఇటీవల కాలంలో తన హాస్యంతో ఆకట్టుకుంటున్న నటుడు రాహుల్ రామకృష్ణ. ఇతగాడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంటారు. ప్రపంచ సినిమా, సాహిత్యం, రాజకీయాలతో పాటు ఇతర ఆసక్తికరమైన అంశాల గురించి తరచుగా ట్వీట్ చేస్తుంటారు రామకృష్ణ. రాహుల్ సోషల్ మీడియా పోస్ట్‌లు వ్యంగ్యంగా ఉంటూ ఆలోచింపచేస్తాయి. ఇక తన సినిమాల గురించి సరేసరి. అయితే ఇటీవల రాహుల్ తన ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా ‘నెట్’ విజయంపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ రాహుల్ ‘మా సినిమా కి జి…లో దమ్ ఉంది’ అని ట్వీట్ చేశారు.
Read Also : నిక్ ‘చిరుతిండి’గా మారిన ప్రియాంక… పిక్ వైరల్
రాహుల్ చేసిన ఈ ట్వీట్‌కి నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. కానీ రాహుల్ ఏమాత్రం తగ్గలేదు. తనపై నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ ని లైట్ తీసుకోవడమే కాదు వాళ్ళపై కూడా ఓ ట్వీటేశాడు. ‘ఓహో ట్విట్టర్ లో అందరు పత్తిత్తులే అన్నమాట’ అంటూ అతను చేసిన ట్వీట్ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ ట్వీట్స్ కొంత మందికి వినోదాన్ని అందిస్తే.. మరి కొందరు సీరియస్ గా స్పందించారు. ఏది ఏమైనా రాహుల్ తన ట్వీట్స్ తో ‘నెట్’ సినిమాకు అనుకున్నదానికంటే ఎక్కువ ప్రచారం తెచ్చిపెట్టాడనే చెప్పాలి. అనుకున్న పని నెరవేరిందని అనుకున్నారో ఏమో రాహుల్ రామకృష్ణ తన ట్వీట్స్ ని విత్ డ్రా చేసేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 10 న జీ 5లో ప్రీమియర్ కాబోతోంది. సైబర్ క్రైమ్స్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ ‘నెట్’ సినిమాలో అవికాగోర్ బోల్డ్ రోల్ లో కనిపించనుంది.