NTV Telugu Site icon

Rahul Ramakrishna: రైలు ప్రమాదం.. కామెడీ చేసిన ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్

Rahul

Rahul

Rahul Ramakrishna:ఒడిశా రైలు ప్రమాదం గురించి అందరికి తెల్సిందే. దాదాపు 250 మంది మృత్యువాత పడగా.. 900 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మృతిచెందిన వారికి సంతాపం తెలుపుతున్నారు. చిరంజీవి నుంచి చరణ్ వరకు.. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా ఈ రైలు ప్రమాదంపై స్టార్ కమెడియన్ అనుచిత వ్యాఖ్యలు చేసి.. నెటిజన్స్ చేత తిట్టించుకుంటున్నాడు. అతను ఎవరో కాదు రాహుల్ రామకృష్ణ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన రాహుల్.. ట్విట్టర్ లో తనకు ఏది నచ్చితే అది పెడుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటాడు. ఇక తాజాగా ఈ ట్రైన్ యాక్సిడెంట్ పై రాహుల్ కామెడీ చేశాడు. సైలెంట్ అనే హాలీవుడ్ సినిమాలో ట్రైన్ సీన్ ను షేర్ చేశాడు. ఆ వీడియోలో ట్రైన్ ముందు కొంతమంది వ్యక్తులు విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఇక ఈ ట్వీట్ చేసిన వెంటనే నెటిజన్లు అతడిపై విమర్శలు కురిపించారు.

Adipurush: ‘ఆదిపురుష్’ కోసం మీ సాహసం.. గుర్తుండిపోతారయ్యా

రైలు ప్రమాదం.. ఎంతమందికి కడుపుకోతకు కారణమయ్యిందో తెలుసా.. నువ్వేమో ఇలాంటి కామెడీ చేస్తున్నావా.? అని కొందరు. నువ్వసలు మనిషివేనా.. ఇది కామెడీ చేసే సమయమా..? అని ఇంకొందరు చెప్పుకొచ్చారు. ఇక వెంటనే ఆ ఘటన తీవ్రత తెలుసుకున్న రాహుల్ నాలుక్కర్చుకొని వెంటనే ట్వీట్ ను డిలీట్ చేశాడు. అంతేకాకుండా నెటిజన్స్ కు సారీ కూడా చెప్పాడు.. ” నేను అంతకుముందు వేసిన ట్వీట్ గురించి క్షమాపణ చెప్తున్నాను. ఈ ఘటన తగురించి నాకసలు తెలియదు. నైట్ నుంచి స్క్రిప్ట్ రాసుకుంటూ కూర్చున్నాను.. తప్పు జరిగింది.. ఒట్టేసి చెప్తున్నా ఇది కావాలని చేసింది కాదు ” అని చెప్పుకొచ్చాడు. ఇక నెటిజన్స్ సైతం రాహుల్ ను క్షమించేశారు. మిమ్మల్ని విమర్శిస్తున్నామని కాదు.. మీ నిజాయితీని మెచ్చుకుంటున్నాం.. అయితే మేము కేవలం ఆ ఘటనకు సంబంధించిన తీవ్రత గురించి చెప్పాము” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారింది.