Radhika Birthday Special : విలక్షణమే రాధికకు సలక్షణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిలిపితనం, చలాకీతనం కలబోసిన రూపంతో రాధిక అనేక చిత్రాల్లో తనదైన బాణీ పలికించారు. ఇప్పుడంటే అమ్మ పాత్రల్లో అలరిస్తున్నారు కానీ, ఒకప్పుడు రాధిక అందం, అభినయం జనాన్ని కట్టిపడేశాయి. ఇక డాన్సుల్లోనూ ఆమె స్పీడును చూసి జనం అబ్బో అన్నారు. కొందరు ఆమె సరసన చిందులు వేయడం చేతకాక బొబ్బలు పెట్టారు. నటిగా అనేక సినిమాలతో జేజేలు అందుకున్నారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో మురిపిస్తూనే ఉన్నారు.
రాధిక 1962 ఆగస్టు 21న మద్రాసులో జన్మించారు. తమిళనాట రంగస్థలంపైనా, కెమెరాముందు మార్తాండుడిలా చెలరేగిపోయిన ప్రముఖ హాస్యనటుడు, విలన్ ఎమ్.ఆర్.రాధ కూతురు రాధిక. తండ్రి బాటలోనే పయనిస్తూ రాధిక, ఆమె చెల్లెలు నిరోషా కూడా నటనలోనే అడుగు పెట్టారు. నిరోషా కంటే రాధిక చాలా రోజులు ముందే కెమెరా ముందు తన ప్రతిభను చాటుకున్నారు. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘కిళక్కే పోగుమ్ రైల్’ చిత్రం ద్వారా రాధిక సినిమా రంగంలో అడుగు పెట్టారు. ఈ చిత్రంలో మన తెలుగు నటుడు సుధాకర్ హీరో. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తరువాత రాధిక, సుధాకర్ జంట పలు చిత్రాలలో నటించి అలరించారు. ఇక తెలుగునాట చిరంజీవితో తెరకెక్కిన ‘న్యాయం కావాలి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు రాధిక. తొలి చిత్రంతోనే రాధిక నటిగా మంచి మార్కులు సంపాదించేశారు. శోభన్ బాబు, చంద్రమోహన్, మురళీమోహన్, చిరంజీవి వంటి హీరోలతో మంచి విజయాలను చూశారు రాధిక.
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
తన తొలి తెలుగు చిత్రం హీరో చిరంజీవితో రాధిక నటించిన “కిరాయి రౌడీలు, ఇది పెళ్ళంటారా, బిల్లా-రంగా, యమకింకరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మొండిఘటం, ప్రేమపిచ్చోళ్ళు, పల్లెటూరి మొనగాడు, అభిలాష, శివుడు శివుడు శివుడు, పులి-బెబ్బులి, గూఢచారి నంబర్ 1, సింహపురి సింహం, హీరో, జ్వాల, దొంగమొగుడు, ఆరాధన, రాజా విక్రమార్క” చిత్రాలు అభిమానులను అలరించాయి. చిరంజీవి, రాధిక హిట్ పెయిర్ గా వెలిగారు. చిరంజీవితో అత్యధిక చిత్రాలలో హీరోయిన్ గా నటించిన క్రెడిట్ కూడా రాధికకే దక్కింది. ఇవే కాకుండా రాధిక నటించిన “అనుబంధం, త్రిశూలం, రాముడు కాదు కృష్ణుడు, స్వాతిముత్యం, రాధాకళ్యాణం, మూడుముళ్ళు, జీవనపోరాటం, ముగ్గురు మొనగాళ్ళు, బావమరదళ్ళు, స్వాతికిరణం” వంటి సినిమాలు కూడా అలరించాయి.
తమిళ, తెలుగు, మళయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన రాధిక బుల్లితెరపైనా తనదైన మార్కు అభినయం ప్రదర్శించారు. నిర్మాతగానూ అనేక చిత్రాలు నిర్మించారు. రాధిక తనను తాను ఎప్పుడూ బిజీగా ఉంచుకొంటూ సాగుతున్నారు. ఆ మధ్య ‘రాజా ది గ్రేట్’లో రవితేజకు తల్లిగా నటించి అలరించారు రాధిక. ఈ యేడాది శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’లోనూ కీలక పాత్ర పోషించారామె. నాగశౌర్య హీరోగా రూపొందిన ‘కృష్ణ వ్రిందా విహారి’ చిత్రంలోనూ రాధిక నటించారు. ఆ సినిమా విడుదల కావలసి ఉంది. ‘గాలివాన’ వెబ్ సిరీస్ లోనూ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారామె. తమిళంలో ఓ ఐదు చిత్రాలలో ఆమె నటిస్తున్నారు. రాధిక మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..