NTV Telugu Site icon

Radhika Apte: టాలీవుడ్ పై మళ్ళీ విషం కక్కిన రాధికా ఆప్టే

Boycott Radhika Apte trends on Twitter

Radhika Apte Shocking comments About Tollywood: తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం అనే సామెత ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ కూడా అలాంటి సామెతనే వాడాలి కానీ ఆమె తెలుగు సినీ పరిశ్రమ వలన పరిచయం కాలేదు కాబట్టి వాడలేకపోతున్నాం. కానీ నిజానికి ఆమె ఎన్ని సినిమాలు చేసినా తెలుగులో ఆమెకు వచ్చిన క్రేజ్ కానీ, రెమ్యునరేషన్లు కానీ ఎక్కడా వచ్చి ఉండవు. కానీ ఇప్పుడు అలంటి తెలుగు సినీ పరిశ్రమ మీదనే ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఆమె ఇలా చేయడం ఇది మొదటి సారి కాదు కానీ ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ గురించి రాధికా ఆప్టే షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాట్లాడుతూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాధికా ఆప్టే తాజాగా జర్నలిస్ట్ రాజీవ్ మసంద్‌తో మాట్లాడింది. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ పితృస్వామ్య నిబంధనలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే అనుభవాలు చాలా ఉన్నాయని టాలీవుడ్ గురించి ఆమె కామెంట్ చేసింది.

Devara: ‘దేవ్-వర’గా దేవర.. టైటిల్‌లోనే ఉంది అసలు మ్యాటర్

టాలీవుడ్‌లో మహిళల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని పేర్కొన్న ఆమె సెట్స్‌లో హీరోయిన్‌ను మూడో వ్యక్తిగా మాత్రమే చూస్తారని విమర్శించింది. టాలీవుడ్‌లో పురుషాధిక్యం అధికంగా ఉంటుందని ఆరోపించిన ఆమె షూటింగ్స్‌ విషయంలోనూ టాలీవుడ్‌లో క్లారిటీ ఉండదని పేర్కొంది. ఇష్టానుసారంగా షూటింగ్‌లను రద్దు చేస్తారని, ఒకవేళ షూటింగ్‌ క్యాన్సిల్‌ చేసినా కూడా దానిపై కనీస సమాచారం ఇవ్వరని ఆమె కామెంట్ చేసింది. ఆ ఇండస్ట్రీలో తన అవసరం అంతేనని గ్రహించి దూరంగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ పరిశ్రమ సత్తా చాటుతూ దూసుకువెళుతూ ఉండగా రాధికా ఆప్టే మాత్రం ఇలా విమర్శించడం ఎంతవరకు సబబు? నిజానికి తెలుగులో భానుమతి, అంజలి దేవి, జమున, కాంచన, వరలక్ష్మి, విజయ నిర్మల, సూర్యకాంతం, సావిత్రి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి, సౌందర్య సహా అనేక మంది నటీమణులు తమను తాము ప్రూవ్ చేసుకుని పేరు తెచ్చుకుంటే ఈమె మాత్రం అనూహ్యంగా విషం కక్కుతూ చర్చకు వస్తోంది. రాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర, రక్త చరిత్ర 2, లెజెండ్‌, లయన్‌ సినిమాల్లో మాత్రమే నటించింది. వీటిలో బాలకృష్ణ సినిమాలు మినహా మిగిలినవన్నీ ద్విభాషా చిత్రాలు కావడం గమనార్హం. ఆమె మీద తెలుగు సినీ అభిమానులు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు.