Radhika Apte: టాలీవుడ్ పై మళ్ళీ విషం కక్కిన రాధికా ఆప్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Radhika Apte Shocking comments About Tollywood: తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం అనే సామెత ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ కూడా అలాంటి సామెతనే వాడాలి కానీ ఆమె తెలుగు సినీ పరిశ్రమ వలన పరిచయం కాలేదు కాబట్టి వాడలేకపోతున్నాం. కానీ నిజానికి ఆమె ఎన్ని సినిమాలు చేసినా తెలుగులో ఆమెకు వచ్చిన క్రేజ్ కానీ, రెమ్యునరేషన్లు కానీ ఎక్కడా వచ్చి ఉండవు. కానీ ఇప్పుడు అలంటి తెలుగు సినీ పరిశ్రమ మీదనే ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఆమె ఇలా చేయడం ఇది మొదటి సారి కాదు కానీ ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ గురించి రాధికా ఆప్టే షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాట్లాడుతూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాధికా ఆప్టే తాజాగా జర్నలిస్ట్ రాజీవ్ మసంద్‌తో మాట్లాడింది. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ పితృస్వామ్య నిబంధనలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే అనుభవాలు చాలా ఉన్నాయని టాలీవుడ్ గురించి ఆమె కామెంట్ చేసింది.
Devara: ‘దేవ్-వర’గా దేవర.. టైటిల్‌లోనే ఉంది అసలు మ్యాటర్
Also Read
- Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
టాలీవుడ్‌లో మహిళల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని పేర్కొన్న ఆమె సెట్స్‌లో హీరోయిన్‌ను మూడో వ్యక్తిగా మాత్రమే చూస్తారని విమర్శించింది. టాలీవుడ్‌లో పురుషాధిక్యం అధికంగా ఉంటుందని ఆరోపించిన ఆమె షూటింగ్స్ విషయంలోనూ టాలీవుడ్‌లో క్లారిటీ ఉండదని పేర్కొంది. ఇష్టానుసారంగా షూటింగ్‌లను రద్దు చేస్తారని, ఒకవేళ షూటింగ్ క్యాన్సిల్ చేసినా కూడా దానిపై కనీస సమాచారం ఇవ్వరని ఆమె కామెంట్ చేసింది. ఆ ఇండస్ట్రీలో తన అవసరం అంతేనని గ్రహించి దూరంగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ పరిశ్రమ సత్తా చాటుతూ దూసుకువెళుతూ ఉండగా రాధికా ఆప్టే మాత్రం ఇలా విమర్శించడం ఎంతవరకు సబబు? నిజానికి తెలుగులో భానుమతి, అంజలి దేవి, జమున, కాంచన, వరలక్ష్మి, విజయ నిర్మల, సూర్యకాంతం, సావిత్రి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి, సౌందర్య సహా అనేక మంది నటీమణులు తమను తాము ప్రూవ్ చేసుకుని పేరు తెచ్చుకుంటే ఈమె మాత్రం అనూహ్యంగా విషం కక్కుతూ చర్చకు వస్తోంది. రాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర, రక్త చరిత్ర 2, లెజెండ్, లయన్ సినిమాల్లో మాత్రమే నటించింది. వీటిలో బాలకృష్ణ సినిమాలు మినహా మిగిలినవన్నీ ద్విభాషా చిత్రాలు కావడం గమనార్హం. ఆమె మీద తెలుగు సినీ అభిమానులు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు.
తాజావార్తలు
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!