Devara: ‘దేవ్-వర’గా దేవర.. టైటిల్‌లోనే ఉంది అసలు మ్యాటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara storyline revealed with new poster: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం ‘దేవర’. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి మాస్ అవతార్‌లో తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైప్ అలీ ఖాన్ కీలక పాత్రలో అలరించబోతున్నారు. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించబోతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న విడుదల కాబోతోందని అధికారికంగా ప్రకటించారు. దసరా సందర్భంగా దేవర పార్ట్ 1 అక్టోబర్ 10న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ ఒకటి నెట్టింట్లో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్ పోస్టర్‌ను చూసి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ హై లెవెల్లో ఉండబోతోన్నాయని, ఎన్టీఆర్‌ను మరింత మాస్ కారెక్టర్‌లో చూపించబోతోన్నారని అనుకుంటున్నారు.
Anuskha Shetty: ‘శీలవతి’గా సరోజ?
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్తలు ముందు నుంచి వస్తున్నాయి. తారక్ తండ్రి కొడుకులుగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది కానీ ఇప్పటి వరు టీమ్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. అయితే కొత్త పోస్టర్‌లో టైటిల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడంతోపాటు సినిమాకి సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టేలా ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. `దేవర` టైటిల్‌లోనే అసలు కథ ఉందని అంటున్నారు. ఎందుకంటే నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ టైటిల్‌లో `దేవర`లో `వర` రెడ్ కలర్‌తో ఉంది అలాగే ఎన్టీఆర్ కొత్త లుక్ కూడా కొత్తగా ఉంది. ఇందులో యంగ్‌గా కనిపిస్తున్నాడు. గతంలో విడుదల చేసిన లుక్‌లో ఎన్టీఆర్ పెద్దగా కనిపించగా ఇప్పుడు యంగ్గా కనిపించాడు. ఇదే ఇప్పుడు అసలు విషయాన్ని బయట పెట్టేలా ఉంది. దేవ్, వర అనే రెండు పాత్రలు ఉంటాయి అని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘దేవర’ చిత్రంలో ఇంకా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీత సారథ్యం వహిస్తుండగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!