బాలకృష్ణ తో రెండు సార్లు జోడీ కట్టింది రాధికా ఆప్టే. ‘లెజెండ్, లయన్’ చిత్రాల్లో ఈ మరాఠీ లేడీ నందమూరి అందగాడితో రొమాన్స్ చేసింది. అయితే, మన బోల్డ్ బ్యూటీ టాలీవుడ్ లో ఒక లాగా బాలీవుడ్ లో మరోలాగా ఉంటుంది. హిందీ తెరపై ఉదారంగా అందాలు ప్రదర్శిస్తుంది. ఇక ఇంగ్లీషు సినిమాలు, ఓటీటీ కంటెంట్ లో అయితే నగ్నంగా కూడా నటిస్తుంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంత సహజంగానైనా నటించేందుకు గార్జియస్ బ్యూటీ రెడీ…
నిన్న మొన్నటి వరకూ రాధికా ఆప్టే బోల్డ్ క్యారెక్టర్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. ఆమెకు నటించే సత్తా కూడా ఉంది. అందులోనూ ఎలాంటి సందేహం లేదు. కానీ, వచ్చిన చిక్కల్లా ఈ మధ్య రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో అరెస్ట్ కావటమే! ఆయనకి, ఈమెకి ఎలాంటి లింక్ లేకున్నా ఇప్పుడు ట్విట్టర్ లో నెటిజన్స్ ‘బాయ్ కాట్ రాధికా ఆప్టే’ అంటూ హ్యాష్ ట్యాగ్ రన్ చేస్తున్నారు. ఆమె చిత్రాల్లో బోల్డ్ సీన్స్, న్యూడ్ సీన్స్ ఉండటమే వారి ఆగ్రహానికి కారణమట!
Read Also: విశ్వక్ ఓవర్ యాక్షన్ తగ్గించు!?
రాధికా ఆప్టే చాలా మంది బాలీవుడ్ నటీనటుల్లాగే కుంద్రాని పల్లెత్తు మాటనలేదు. మద్దతు కూడా తెలపలేదు. శిల్పా శెట్టి భర్త వివాదంలో మౌనంగా ఉండిపోయింది. ఇదే చాలా మంది నెటిజన్స్ కు నచ్చలేదు. బీ-టౌన్ సెలబ్స్ తమకు నచ్చని సామాజిక అంశాలు, పరిణామాలపై తీవ్రంగా స్సందిస్తుంటారు. రాజకీయ అంశాలపైనా, అత్యాచారాల వంటి నేరాలపైనా, హిందూ మతం తాలూకూ వివాదాలపైనా చాలా మంది ట్వీట్లు చేస్తుంటారు. కామెంట్లు చేస్తుంటారు. కానీ, తమ స్వంత బాలీవుడ్ లో రాజ్ కుంద్రా పోర్న్ సంబంధమైన ఆరోపణలు ఎదుర్కొంటే ఎవ్వరూ ఆయన గురించి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే ఇప్పుడు సెగకి కారణం అవుతోంది…
రాధికా సినిమాల్లో నగ్నత్వాన్ని, బూతుని ప్రొత్సహిస్తోందని నెటిజన్స్ ఆరోపణ. భారతీయ సంస్కృతిని భ్రష్టుపట్టిస్తున్న ఆమె సినిమాల్ని బాయ్ కాట్ చేయమని పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. చూడాలి మరి, ‘లెజెండ్’ లేడీ తనపై వస్తోన్న ఆరోపణలకి ఎలాంటి సమాధానం ఇస్తుందో!