అఫిషియల్ : “రాధేశ్యామ్” టీజర్ ముహూర్తం ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే పాన్-ఇండియా రొమాంటిక్ డ్రామా “రాధే శ్యామ్”. ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ఈ సినిమా టీజర్ అక్టోబర్ 23 న తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. “విక్రమాదిత్య ఎవరు? అక్టోబర్ 23 న ‘రాధేశ్యామ్’ టీజర్ లో తెలుసుకోవడానికి వేచి ఉండండి! టీజర్‌ను ఇంగ్లీష్ తో పాటు బహు భాషల్లో ఉపశీర్షికలతో ఆస్వాదించండి” అని ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రభాస్ తన పోస్ట్‌లో #GlobalPrabhasDay అనే వైరల్ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.
Read Also : నవ్వుల రేడు… రాజబాబు!
Also Read
ఈ చిత్రం 2022 జనవరి 14న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదల కానున్న అన్ని సినిమాలు దూకుడుగా సినిమా ప్రమోషన్లు చేస్తుంటే ‘రాధేశ్యామ్’ టీం మాత్రం సైలెంట్ గా ఉంది. కానీ తాజాగా విడుదల చేసిన అప్డేట్ తో రెబల్ స్టార్ అభిమానులు సంతోషంగా ఉన్నారు. విక్రమాదిత్య ఎవరు అనే విషయాన్నీ ప్రపంచానికి పరిచయం చేయడానికి ‘రాధే శ్యామ్’ టీజర్ సిద్ధంగా ఉంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ‘రాధే శ్యామ్’ ఇటలీ నేపథ్యంలో రూపొందింది. గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్, టి-సిరీస్ బ్యానర్ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.
తాజావార్తలు
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
-
EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
-
Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
-
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!