రాధేశ్యామ్.. ప్రభాస్.. పూజా హెగ్డే.. థమన్.. యూవీ క్రియేషన్స్.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇవే పేర్లు వినిపిస్తున్నాయి. సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ సినిమా ఎన్నో వాయిదాలను దాటుకొని మార్చి 11 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక విడుదల సమయం దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూ లు అంటూ ప్రభాస్, పూజ హెగ్డే క్షణం కూడా బిజీగా లేకుండా కష్టపడుతున్నారు. ఇక నేడు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న ప్రభాస్.. తన పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
” ఈ సినిమాలో పరమహంస పాత్రలో పెదనాన్న గారు కనిపిస్తారు.. గోపికృష్ణ మూవీస్ లో నేను, ఆయన కలిసి బిల్లా చేశాం.. ఈసారి ఈ సినిమాతో ఆయనకు హిట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ సినిమాలో నేను, పెదనాన్న గారు రెండు సీన్లలో కనిపిస్తాం. అన్ని తెల్సిన బుద్ధుడు ఆయన.. కానీ ఆయన మాటల్లో ఒక వెటకారం కనిపిస్తుంది. అలా డిజైన్ చేశారు డైరెక్టర్ రాధా.. మొదట ఈ పాత్ర కోసం గెడ్డం పెంచాలంట పెదనాన్న.. అంటే పెంచేద్దాం.. ఎంత కావాలంట.. ఇంత సరిపోతుందా ఫోటో పెట్టు.. అంటూ చాలా ఎనర్జిటిక్ గా మాట్లాడారు. ఇక ఆయనతో ఎవరు ఏది మాట్లాడాలన్నా నన్నే మాట్లాడమనేవారు.. ఆయనతో కష్టం అనేలా చూసేవారు.. కానీ ఆయన చాలా జోవియల్ గా ఉంటారు. డైరెక్టర్ తో అయితే ఇలా చేయనా.. ఈ కర్ర ఇలా పట్టుకోనా అంటూ మాట్లాడేవారు. పెదనాన్న గారితో కలిసి నటించడం చాలా అద్భుతం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ యాక్యులు నెట్టింట వైరల్ గా మారాయి.
