ఇటీవలి కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. ఈ మూవీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటించింది. జగపతి బాబు, కృష్ణంరాజు, ప్రియదర్శి, జయరామ్, భాగ్యశ్రీ, సత్యరాజ్ తదితరులు యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాలో భాగమయ్యారు. జస్టిన్ ప్రభాకరన్, థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Read Also : Radhe Shyam : కొత్త జీవో చిక్కులు… ఇంకా టికెట్స్ కౌంటర్స్ ఓపెన్ కాలేదు !!
లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే… ఈ సినిమా ఫస్ట్ షో హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలోని ప్రముఖ థియేటర్ అర్జున్‌లో ప్రదర్శితం కానుంది. బజ్ ప్రకారం బెనిఫిట్ షో శుక్రవారం తెల్లవారుజామున జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా 4వ షోను ఒక వారంపాటు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు ఆంధ్రాలో ఇంకా టికెట్ కౌంటర్లు ఓపెన్ కాకపోవడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.