Vikranth Rona: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ బండారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రాంత్ రోణ’. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషియో ఫాంటసీగా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, కిచ్చా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి ముఖ్యంగా ఈ సినిమాలోని ఐటెం సాంగ్ రారా రక్కమ్మ సోషల్ మీడియాలో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా ఈ సాంగ్ పైనే చర్చ, యువత రీల్ చేసి మరీ ప్రమోషన్స్ ను పెంచేశాయి. ఇక ఈ సాంగ్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వలిన్ పెర్నాండజ్, సుదీప్ తో కలిసి ఆడిపాడింది.
తెలుగులో మంగ్లీ ఈ గీతాన్ని ఆలపించింది. ఒక్క కన్నడలోనే కాకుండా ఈ సాంగ్ ఐదు భాషల్లోనూ రచ్చ రేపుతోంది. ఇక ఈ సాంగ్ సిగ్నేచర్ స్టెప్ అయితే సినీ ప్రముఖులు కూడా రీల్స్ చేస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. అలంటి పాట వీడియోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ పెంచేసిన చిత్ర బృందం అభిమానులకు ఎంతగానో నచ్చిన ఈ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో రక్కమ్మ గా జాక్వలిన్ అందాల జాతర కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.