Site icon NTV Telugu

R Madhavan: ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నా..

Maddy

Maddy

R Madhavan: కోలీవుడ్ సీనియర్ హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో మ్యాడీ అంటే.. అమ్మాయిలు చేతులు కోసేసుకొనేవారట. చెలి. సఖి సినిమాల తరువాత చేసుకుంటే మ్యాడీనే చేసుకుంటా అని అనేవారంట. కోలీవుడ్ లో అంత లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అంటే మాధవన్ అనే చెప్పాలి. అయితే .. మ్యాడీకి మాత్రం ఒక హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని ఉండేదట. ఆమెను పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడట. ప్రస్తుతం మాధవన్ నటించిన ది రైల్వే మ్యాన్ సిరీస్.. నెట్ ఫ్లిక్స్ మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు కొనసాగుతోంది. ఇక ఆ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మ్యాడీ.. తన మనసులోని మాటలను బయటపెట్టాడు. మొట్ట మొదటిసారి.. ది రైల్వే మ్యాన్ సిరీస్ లో మాధవన్ తో పాటు బాలీవుడ్ అందాల భామ జూహీ చావ్లా నటించింది. తాను మొదటిసారి ప్రేమించిన అమ్మాయి జూహీనే అని చెప్పి షాక్ ఇచ్చాడు మ్యాడీ.

Jr. Ntr :ఎన్టీఆర్ కేరీర్ లో అరుదైన రికార్డ్ ను కైవసం చేసుకున్న సినిమాలు ఇవే..

” నా అదృష్టం బావుండి .. జూహీ చావ్లా ఈ సిరీస్ కు ఓకే చెప్పారు. ఈ సందర్భంగా మీలో విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నేను కెరీర్ స్టార్ట్ చేయకుముందు.. ఖయామత్‌ సే ఖయామత్‌ టక్‌ అనే సినిమాలో జూహీ ని చూసి ఫిదా అయిపోయాను. పెళ్లి చేసుకుంటే.. ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఈ విషయం మా అమ్మకు కూడా చెప్పాను. ఇంకా చెప్పాలంటే.. ఆమెను పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా బతికాను” అని చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల్లోకి వచ్చాకా.. మ్యాడీ లైఫ్ మారిపోయింది. 1999 లో సరితా బిర్జి అనే అమ్మయిని మ్యాడీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు. ప్రస్తుతం మ్యాడీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version