Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Quick Style: హైదరాబాద్‌లో డ్యాన్స్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తనదైన డ్యాన్స్ స్టైల్‌తో భారీ క్రేజ్ సంపాదించుకున్న నార్వేజియన్ డ్యాన్స్ ట్రూప్ ‘క్విక్ స్టైల్’ (Quick Style) హైదరాబాద్‌లో తొలిసారి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది. తమ టచ్ డౌన్ వరల్డ్ టూర్ 2026లో భాగంగా నవంబర్ 1న కొండాపూర్‌లోని క్వేక్ అరేనాలో ఈ స్పెషల్ షో నిర్వహించనున్నారు. ఇంతకీ ఈ షో ఎప్పుడు మొదలవుతుంది? టికెట్ ధర ఎంత? క్విక్ స్టైల్‌కు ఇంత క్రేజ్ రావడానికి కారణమేంటి? అనే వివరాలపై ఓ లుక్ వేద్దాం పదండి.
హిప్ హాప్, బాలీవుడ్, మల్టీకల్చరల్ డ్యాన్స్ స్టైల్స్‌ను కలిపి తమదైన ఎనర్జిటిక్ కొరియోగ్రఫీతో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న క్విక్ స్టైల్‌కు హైదరాబాద్‌లోనూ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. 2009లో నార్వేస్ గాట్ టాలెంట్ విజేతలుగా నిలిచిన ఈ డ్యాన్స్ గ్రూప్‌కు 2022లో ఊహించని స్థాయిలో గ్లోబల్ గుర్తింపు వచ్చింది. ‘కాలా చష్మా’ పాటకు ఒక పెళ్లి వేడుకలో చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రూప్ పేరు మార్మోగిపోయింది.
Also Read
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ 'ఇరుముడి'
- Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
- Biggest Flop Movies : ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిన టాప్ సినిమాలు ఇవే..
అప్పటి నుంచి ‘క్విక్ స్టైల్’ ప్రయాణం సోషల్ మీడియా వరకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచ ప్రఖ్యాత కే పాప్ బ్యాండ్ BTS కోసం ‘బాయ్ విత్ లవ్’, ‘బ్లడ్ స్వెట్ అండ్ టియర్స్’ వంటి పాటలకు కొరియోగ్రఫీ చేయడంతో వారి క్రేజ్ మరింత పెరిగింది. 50కి పైగా దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చిన ఈ గ్రూప్ హాలీవుడ్, బాలీవుడ్ సంగీత ప్రముఖులతో కలిసి పనిచేసింది. సల్మాన్ ఖాన్, విరాట్ కోహ్లీ వంటి భారతీయ సెలబ్రిటీలతోనూ క్విక్ స్టైల్‌కు అనుబంధం ఉంది.
ఇప్పుడు టచ్ డౌన్ వరల్డ్ టూర్ 2026లో భాగంగా హైదరాబాద్ వేదికపై తమ ఎనర్జీని చూపించేందుకు క్విక్ స్టైల్ సిద్ధమైంది. కొండాపూర్‌లోని క్వేక్ అరేనాలో నవంబర్ 1న రాత్రి 8 గంటలకు షో ప్రారంభం కానుంది. దాదాపు 90 నిమిషాల పాటు సాగే ఈ లైవ్ పెర్ఫార్మెన్స్లో హిప్ హాప్ నుంచి బాలీవుడ్ బీట్స్ వరకు క్విక్ స్టైల్‌కు ప్రత్యేకమైన డ్యాన్స్ కొరియోగ్రఫీని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది.
ఈ కార్యక్రమానికి 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. టికెట్ల ధర రూ.1,499 నుంచి ప్రారంభమవుతోంది. హైదరాబాద్ షో తేదీని ముందుగానే ప్రకటించినప్పటికీ వేదిక వివరాలను మాత్రం కొంతకాలం గోప్యంగా ఉంచారు. తాజాగా కొండాపూర్‌లోని క్వేక్ అరేనాను వేదికగా ఖరారు చేయడంతో అభిమానుల ఈ షో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ముఖ్యంగా సోషల్ మీడియాలో క్విక్ స్టైల్ వీడియోలను చూసి అభిమానించిన వారికి ఇది లైవ్‌లో చూసే ప్రత్యేక అవకాశం కానుంది. స్క్రీన్‌పై వారి ఫేమస్ స్టెప్స్, హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్ను లైవ్ లో చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీంతో నవంబర్ 1న క్వేక్ అరేనాలో జరిగే ఈ షో కోసం హైదరాబాద్ డ్యాన్స్ లవర్స్ ఇప్పటి నుంచే కౌంట్‌డౌన్ మొదలుపెట్టొచ్చు.
- Tags
- cinema
- Quick Style
తాజావార్తలు
-
Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
-
OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
-
KTR: “రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా”.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
-
IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’
-
Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?