NTV Telugu Site icon

Pushpa 2: మూడు నిమిషాల టీజర్ వస్తోంది… పాన్ ఇండియా రికార్డులు లేస్తాయ్…

Allu Arjun

Allu Arjun

ఇప్పటివరకూ ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా ఇవ్వని పుష్ప 2 సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో కంప్లీట్ అయ్యింది. రష్మిక, అల్లు అర్జున్, ఫాహద్ లు పాల్గొన్న ఈ షెడ్యూల్ ని పూర్తి చేసిన సుకుమార్, నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ పుష్ప 2కి సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చెయ్యకుండా సీక్రెట్ గా షూటింగ్ చేస్తున్న సుకుమార్, అల్లు అర్జున్ పుట్టిన రోజున పుష్ప 2 ఫస్ట్ లుక్ తో పాటు, ఒక టీజర్ ని కూడా రిలీజ్ చెయ్యబోతున్నాడట. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉండే ఒక యాక్షన్ పార్ట్ కి సంబంధించిన టీజర్ ని కట్ చేసి ఆడియన్స్ ముందుకి తీసుకోవడానికి మేకర్స్ రెడీ అయ్యారు.

ఇప్పటికే టీజర్ కట్ కంప్లీట్ అయ్యి ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ జరుగుతుందని సమాచారం. పాన్ ఇండియా సినిమా అంటే పాన్ ఇండియా రేంజులో ప్రమోషన్లు చెయ్యాలి. పుష్ప పార్ట్ 1కి ప్రమోషన్స్ లో కాస్త వెనక్కి తగ్గిన చిత్ర యూనిట్ ఈసారి మాత్రం ప్రమోషన్స్ విషయంలో తెగ్గేదే లే అన్నట్లు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నార్త్ లో జీరో బజ్ తో సాలిడ్ బిజినెస్ చేసింది పుష్ప పార్ట్ 1 సినిమా, అలాంటిది ఆకాశాన్ని తాకే అంత బజ్ ఉన్న పుష్ప 2 సినిమా ఇంకెలాంటి బిజినెస్ చేస్తుందో ఊహించడం కూడా కష్టమే. హిందీ వరకూ పుష్ప 2 సినిమా స్కై రాకెటింగ్ బిజినెస్ చేస్తుంది. అంచనాలని మించే రేంజులో పుష్ప 2 సినిమా ఉంటుంది అని సుకుమార్ ప్రూవ్ చెయ్యాలి అంటే పుష్ప 2 టీజర్ తో ఎవరూ ఊహించని రేంజులో మ్యాజిక్ చెయ్యాలి. మరి పాన్ ఇండియా సినిమా ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ లాంటి టీజర్ ఎలా ఉంటుందో చూడాలి అంటే ఏప్రిల్ 8 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.

Show comments