Pushpa-2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప-2 ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇందులో కనిపించే సెట్లు, యాక్షన్ సీన్లు, అడవులత్లో దుంగలు దాచే సీన్లు.. బాగా ఆకట్టుకున్నాయి కదా. వాటిని చూసి అసలు సుకుమార్ ఇవన్నీ ఎక్కడ నుంచి క్రియేట్ చేశాడో అనుకున్నాం. కానీ అవన్నీ వీఎఫ్ ఎక్స్ తో చేసినవే అని తేలిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే పుష్ప-2లోని అన్ని సీన్లు వీఎఫ్ ఎక్స్ లో చేసినవే. ఇన్ని రోజులు అవన్నీ నిజమైనవి అనుకున్న వాళ్లు షాక్ అవుతున్నారు. తాజాగా వీఎఫ్ ఎక్స్ కు సంబంధించిన వీడియోను సినిమా నిర్మాతల్లో ఒకటి అయిన సుకుమార్ రైటింగ్స్ సంస్థ తాజాగా ఆ వీడియోను రిలీజ్ చేసింది.
Read Also : PM Modi: ఎలాన్ మస్క్‌కి ప్రధాని మోడీ ఫోన్.. ముచ్చటెందంటే!
ఇందులో పుష్పరాజ్ జపాన్ ఫైట్, మాల్దీవుల్లో డీలింగ్ చేయడం, అడవుల్లో చెట్ల మీద దుంగలు దాచిపెట్టడం, సముద్రంలో దుంగలు స్మగ్లింగ్ చేయడం.. ఇవన్నీ వీఎఫ్ ఎక్స్ తో క్రియేట్ చేసినవే. ఇది చూసిన వారంతా.. అసలు పుష్ప-2 మొత్తం వీఎఫ్ ఎక్స్ ఉంది కదారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. సుకుమార్ మనల్ని మోసం చేశాడు అంటూ కొందరు ఫన్నీ కామెట్లు చేస్తున్నారు. చూడటానికి రియాల్టీగానే ఉన్నా.. సుకుమార్ దాన్ని వీఎఫ్ ఎక్స్ తోనే తయారు చేయించాడు. వాస్తవానికి సినిమా చూసిన వారికి ఇందులో వీఎఫ్ ఎక్స్ ఎక్కడా వాదలేదు కదా అనిపిస్తుంది. కానీ ఇందులో వాడినంత వీఎఫ్ ఎక్స్ అంతా ఇంతా కాదు. మరి మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.