పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు అల్లు అర్జున్. “నీయవ్వ తగ్గేదే లే” అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ని ఆడియన్స్ నుంచి ఇంటర్నేషనల్ సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యారు. బన్నీ మ్యానరిజమ్స్ వైరల్ అవ్వడంతో పుష్ప ది రూల్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ పుష్పరాజ్ రాక కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకే పుష్ప 2 కథని చైనాతో లింక్ చేసి ఎవరూ ఊహించని విధంగా సినిమాని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసిన సుకుమార్, అల్లు అర్జున్ బర్త్ డే రోజున మూడు నిమిషాల వీడియో రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఒక పోస్టర్ అండ్ ఒక మూడు నిమిషాల వీడియో, ఒక సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలని సృష్టించగలవు అని నిరూపించారు సుకుమార్ అండ్ అల్లు అర్జున్. ముఖ్యంగా గంగమ్మ తల్లి జాతరలోని అమ్మోరి అవతారంలో అల్లు అర్జున్ కనిపించిన పోస్టర్ పుష్ప ది రూల్ సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకోని వెళ్ళాయి. ఈ లుక్ చూసిన తర్వాత బన్నీపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాలో ఈ లుక్‌కు సంబంధించిన సీన్స్ పీక్స్‌లో ఉంటాయని ఫిక్స్ అయిపోయారు. అయితే అది క్లైమాక్స్‌లో ఉంటుందని అనుకున్నారు. కానీ మన లెక్కల మాస్టారు లెక్క వేరేలా ఉంది. ఇంటర్వెల్‌కే పూనకాలు తెప్పించబోతున్నాడట.
Read Also: Tollywood: ఈ ‘సాలా’ అనే పదాన్నే బాన్ చెయ్యాలి మావా…
గంగమ్మతల్లి జాతర ఎపిసోడ్‌ను ఎవరు ఊహకందని విధంగా తెరకెక్కిస్తున్నాడట సుకుమార్. జస్ట్ ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్‌ను దాదాపు 35 రోజుల పాటుగా షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బన్నీ, సుకుమార్ చాలానే కష్టపడుతున్నారట. సుక్కు సినిమాల్లో ఇంటర్వెల్ మాములుగా పీక్ స్టేజ్ లో ఉంటుంది, అలాంటిది ఇక అల్లు అర్జున్ అమ్మోరి గెటప్, జాతర సెటప్ అంటే పుష్ప2 ఇంటర్వెల్ బ్యాంగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. తెలుగు తెరపై ఇప్పటి వరకు చూడని ఇంటర్వెల్ బ్యాంగ్‌ని సుకుమార్ చూపించబోతున్నాడట. ఈ సినిమాను దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో.. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్.