Puri Jagannadh: పూరీ ‘స్లమ్ డాగ్’ విడుదలకు అడ్డంకులు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూరీ జగన్నాథ్ చివరి రెండు సినిమాలు ఆయనపై ప్రభావాన్ని చూపాయి. ‘లైగర్’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా ఆ సమయంలో నష్టపోయిన బయ్యర్లకు కొంత శాతం తిరిగి చెల్లిస్తానని పూరీ హామీ ఇచ్చారు. అయితే, ఆ హామీ నెరవేరలేదనే ఆరోపణలు ఉన్నా, తర్వాత వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’** విషయంలోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. ఈ సినిమా థియేట్రికల్ నష్టాల్లో కొంత భాగాన్ని భరిస్తానని చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు జరగలేదని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పూరీపై గతంలో ఎప్పుడూ లేనంతగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read :Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’కు బ్రేక్ ..కారణం ఏంటంటే?
Also Read
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ – విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ అనే సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కానీ, పాత బకాయిల ఇష్యూ ఇప్పుడు ఈ సినిమా విడుదలకు పెద్ద అడ్డంకిగా మారింది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ బకాయిలు తీర్చనిదే ‘స్లమ్ డాగ్’ విడుదలకు సహకరించబోమని తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. ఇప్పటికే సుమారు రూ. 5 కోట్ల బకాయిలకు సంబంధించి ఆర్బిట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోన్న క్రమంలో ఈ గొడవలు సర్దుమణిగితేనే సినిమాను కొనుగోలు చేస్తామని ప్రముఖ OTT సంస్థలు కూడా నిబంధనలు పెడుతున్నట్లు సమాచారం. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా బౌన్స్ బ్యాక్ అవ్వడం పూరీకి కొత్తేమీ కాదు కానీ ఈసారి సమస్యలు ఆర్థికంగానే కాకుండా, నమ్మకానికి సంబంధించినవి కూడా కావడంతో ఆయన ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ‘స్లమ్ డాగ్’ సినిమా స్మూత్‌గా థియేటర్లలోకి రావాలంటే పూరీ జగన్నాథ్ స్వయంగా రంగంలోకి దిగి ఈ వివాదాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!