NTV Telugu Site icon

Fanism at Peaks: ఇదెక్కడి అరాచకం అయ్యా.. పునీత్, ఎన్టీఆర్ ఫాన్స్ ఏం చేశారో చూస్తే తట్టుకోలేరు?

Puneet Ntr Fans

Puneet Ntr Fans

Puneeth Rajkumar, Jr NTR fans hang from cranes at local temple festival: మనదేశంలో దేవుళ్ళకు భక్తులు ఎలా ఉంటారో హీరోలకి అభిమానులు కూడా అలానే ఉంటారు. ఒకరకంగా పూజలు చేయరు అనే మాటే కానీ పాలాభిషేకాలు, పూల దండలు అయితే కామన్. క్రేజీ ఫాన్స్ హేమ అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో చేసే వింతలు, విన్యాసాలు చూసేందుకు అయితే రెండు కళ్ళూ చాలవు. ఇక పునీత్ రాజ్‌కుమార్, జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్‌లను పట్టుకుని క్రేన్‌కు వేలాడుతున్న అభిమానులకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం అయింది. అందుతున్న సమాచారం మేరుకు ఈ వీడియో కర్ణాటకలో జరుపుకునే స్థానిక ఆలయ ఉత్సవానికి చెందినదని అంటున్నారు. పునీత్ రాజ్‌కుమార్ 2021లో 46 ఏళ్ల వయసులో మరణించారు అప్పటికే ఆయనకు కర్ణాటకలో ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Anil Sunkara: చిరంజీవితో మరో సినిమా చేసి సమాధానం చెప్తా..లీకైన అనిల్ సుంకర వాట్సాప్ చాట్?

అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగు హీరో అయినా ఆయనకు, కన్నడ సినీ సత్తాను పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లిన యష్‌కు కూడా అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక తాజాగా రెండు వీడియోలు ఇంటర్నెట్‌లో కనిపించగా అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో, జూనియర్ ఎన్టీఆర్ మరియు పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు క్రేన్‌కు వేలాడుతున్నప్పుడు భారీ బ్యానర్‌ను పట్టుకుని కనిపించారు. ఇక ఒళ్ళు గగుర్పొడిచే విషయం ఏమంటే ఈ అభిమానులు అందరూ శరీరానికి కొక్కాలు గుచ్చుకుని క్రేన్ కు వేళ్ళాడుతున్నారు. దశావతారం సినిమాలో కమల్ ను ఎలా అయితే కొక్కాలకు వేలాడతీశారో అదే విధంగా ఇక్కడ కూడా వేలాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Show comments