Site icon NTV Telugu

Upasana : చిరంజీవి ఇంట్లో పూజ.. ఉపాసన ఏం చేసిందో చూడండి

Upasana

Upasana

Upasana : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అమ్మవారి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాసన ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కోడలు ఉపాసన కలిసి పూజ నిర్వహించారు. ఇందులో తన అత్తమ్మ సురేఖతో పండుగ గురించి అడిగి తెలుసుకున్న కొన్ని విషయాలను ఆమె పంచుకున్నారు. వీరిద్దరూ కలిసి అత్తమ్మాస్ కిచెన్ అనే బిజినెస్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కిచెన్ స్టోర్ ద్వారా.. ఎంతో రుచికరమైన తినే ఫుడ్స్ ను వీళ్లు ప్రిపేర్ చేసి అమ్ముతున్నారు.

Read Also : Sanjana Galrani : ఆ హీరో నన్ను టార్చర్ చేశాడు.. చేయి పట్టుకుని లాగి..

వీరే స్వయంగా తిండి వంటకాలను తయారు చేసి మరీ అమ్ముతున్నారు. కొన్ని ఇళ్లలో అయినా మధుర స్మృతులను తమ తిండి వంటకాల ద్వారా సృస్టించాలన్నదే తమ ఉద్దేశం అని ఉపాసన తెలిపింది. ఇక సోషల్ మీడియాలో ఉపాసన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా.. ఇంత పద్ధతిగా ఉన్నారు కాబట్టే మీకు అంత ఆదరణ దక్కుతోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ఉపాసనకు భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఆమె హెల్త్ టిప్స్ తో పాటు సోషల్ అవేర్ నెస్ వీడియోలను షేర్ చేస్తుంది.

Read Also : Heroins : సీఎంల ఇంటికి కోడళ్లుగా వెళ్లిన హీరోయిన్లు వీరే..

Exit mobile version