Site icon NTV Telugu

Project-K: ప్రభాస్ తో నటించే బంఫర్ ఆఫర్.. పట్టేయండి ఇలా..

Prabhas

Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కె. వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా గురించిన అప్డేట్ ని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు నటించే అవకాశాన్ని మేకర్స్ కల్పించారు. ప్రాజెక్ట్ కె క్యాస్టింగ్ కాల్ కి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఏప్రిల్ 3, 4 తేదీలలో ఈ కార్యక్రమం జరగనున్నది. వయస్సు, లింగ బేధం, భాష, ఇలాంటి బేధాలు ఏమి లేవని, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు అర్హులే అని మేకర్స్ తెలిపారు. ఫేసెస్ ఆఫ్ ది ఫ్యూచర్ అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాం లో ఎంతమంది సెలెక్ట్ అయ్యి ముందు ముందు టాలీవుడ్ లో టాలెంట్ ని చూపిస్తారో చూడాలి. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ నటనకు సాన పెట్టి, ప్రభాస్ సినిమాలో ఛాన్స్ పట్టేయండి.

Exit mobile version