Mirai : తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో నిర్మాత విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. మిరాయ్ సినిమా ఎవరూ ఊహించని విధంగా ఉంటుందన్నాడు. ఇందులో ఉన్న కంటెంట్, విజువల్స్ తో ఒక తెలుగు సినిమా కచ్చితంగా పాన్ ఇండియా స్థాయికి వెళ్తుందన్నారు. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇది పాన్ వరల్డ్ ప్రాంచైజీగా మారుతుందని ప్రకటించారు.
Read Also : SS Rajamouli : వెబ్ సిరీస్ లో నటించిన రాజమౌళి.. ఎలా చేశాడో చూశారా..
ఈ సినిమా కోసం తేజ సజ్జా చాలా కష్టపడ్డాడు. మంచు మనోజ్ ఇందులో అద్భుతమైన పాత్ర చేశాడు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది. కార్తీక్ ఈ కథ గురించి చెప్పినప్పుడే నాకు నమ్మకం ఏర్పడింది అంటూ వివరించారు విశ్వ ప్రసాద్. నిర్మాతగా ఎలా మారారు అని సుమ ప్రశ్నించగా.. తాను అమెరికాలో పాడుతా తీయగా ప్రోగ్రామ్ ను నిర్మించే అవకాశం వచ్చిందన్నారు. ఆ తర్వాత చిరంజీవి సినిమాలు చూస్తూ సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగిందని.. అందరితో ఎలాగూ పరిచయాలు ఉన్నాయి కాబట్టి అలా తాను సినిమాల్లోకి వచ్చానన్నారు విశ్వ ప్రసాద్.
Read Also : Rithika Nayak : మిరాయ్ హీరోయిన్ రితిక నాయక్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
