యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది అద్భుతమైన ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, నెక్స్ట్ వరుస ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. అయితే అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ సినిమా ఇంకా ఎనౌన్స్ కానప్పటికీ ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా రూపొందించబోతున్నామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో భారీ స్థాయిలో నిర్మితమవుతుందని, ఎన్టీఆర్ కు సరిపోయే అద్భుతమైన కథను త్రివిక్రమ్ సిద్ధం చేశారని ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోలేదని, లార్జ్ స్కేల్ లో భారీ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు నిర్మాత నాగవంశీ. దీంతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో రానున్న సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై ప్రకటన వెలువడనుంది.
Read Also : Chiranjeevi, Balakrishna : బొత్స కొడుకు పెళ్ళిలో స్టార్స్ సందడి
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో ఇంతకు ముందు ‘అరవింద సమేత వీర రాఘవ’ అనే బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన విషయం తెలిసిందే. మరోసారి ఈ కాంబో రిపీట్ కానుందని వార్తలు వచ్చినప్పటి నుండి, అభిమానులు అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక నిర్మాత నాగవంశీ నందమూరి అభిమానులకు చెప్పిన గుడ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ విషయానికొస్తే ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఎన్టీఆర్ కొమరం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం మార్చి 25న థియేటర్లలోకి రానుంది.