NTV Telugu Site icon

Masooda: ఆర్జీవీ నీ పనికిమాలిన టైం మాకు ఇవ్వు…

Rahul Yadav Nakka

Rahul Yadav Nakka

రామ్ గోపాల్ వర్మ చేసే ట్వీట్స్ ని అర్ధం చేసుకోవాలి అంటే చాలా బ్రెయిన్ పెట్టాలి. మహానుభావుల మాటలు అస్సలు అర్ధం కావు అన్నట్లు వర్మ ట్వీట్స్ కూడా అర్ధం కావు. ఆయన అభిమానించే ఫాన్స్ కూడా దాదాపు ఇలానే ఉంటారు అని ప్రూవ్ చేశాడు ప్రొడ్యూసర్ ‘రాహుల్ యాదవ్’. ‘మళ్లీరావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి మంచి హిట్ సినిమాలని ‘స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేసిన రాహుల్ యాదవ్, రీసెంట్ గా ‘మసూద’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిన ‘మసూద’ సినిమా హారర్ జానర్ లవర్స్ ని మెప్పిస్తోంది. హారర్ కామెడి, హారర్ లవ్ లాంటి మిక్స్డ్ జానర్ సినిమాలు వస్తున్న టైంలో సినీ అభిమానులకి వెన్నులో వణుకుపుట్టించే రేంజులో వచ్చిన సినిమా ‘మసూద’. థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకోని ఇటివలే ‘ఆహా’లో రిలీజ్ అయిన ఈ మూవీ ఓటీటీలో కూడా మంచి వ్యూవర్షిప్ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఒక చిన్న సినిమా ఇంత సౌండ్ చెయ్యడం ఇదే మొదటిసారి.

Read Also: Masooda: మసూద.. వీక్ హార్ట్ అయితే గుండెపోటు ఖాయమట..?

సాలిడ్ హిట్ కొట్టిన జోష్ లో ఉన్న ‘రాహుల్ యాదవ్’ తన అభిమాని దర్శకుడికి, హారర్ సినిమాల స్పెషలిస్ట్ అయిన వర్మకి ‘మసూద’ చూపించాలి అనుకున్నాడు… కాదు కాదు ‘మసూద’ సినిమాని చూడమని అడిగాడు. అది కూడా అందరిలా ‘సార్ మా సినిమా చూడండి అంటే అతను ఆర్జీవీ ఫ్యాన్ ఎందుకు అవుతాడు? మసూద లాంటి సినిమా ఎందుకు ప్రొడ్యూస్ చేస్తాడు?’. వర్మ ఫ్యాన్ కదా అందుకే వర్మ స్టైల్ లోనే… “హలో ఆర్జీవీ గారు, మీ పనికిమాలిన టైంలో మాకు కొంచెం మీ పనికిమాలిన టైం ఇచ్చి మేము అనుకున్న పనికొచ్చే సినిమా మసూదాని ఆహాలో చూసి మీ పనికిమాలిన రివ్యూ ఇస్తే మేము పనికి ఒచ్చేటట్టు వాడుకుందాం అని మా పనికిమాలిన ఆలోచన… ఇట్లు మీ పనికిమాలిన అభిమాని…” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన ఫాన్స్, పర్ఫెక్ట్ ఆర్జీవీ ఫాన్ అంటూ ‘రాహుల్ యాదవ్’ని పొగిడేస్తున్నారు. నిజమే తన సినిమాని చూడామణి ఏ ప్రొడ్యూసర్, ఏ డైరెక్టర్ ఇంకో స్టార్ టెక్నిషియన్ ని ఇలా అడగడు. ఆర్జీవీ అంతే ఆయన అభిమానులు అంతేనేమో. మరి రాహుల్ యాదవ్ చేసిన పనికిమాలిన ట్వీట్ చూసి, వర్మ రెస్పాండ్ అవుతాడో లేదో చూడాలి.

Show comments