Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Producer Natti Kumar Counter To Nani On Ap Movie Tickets Issue

ఏపీ టికెట్ల వివాదం : నాని కామెంట్స్ పై నిర్మాత నట్టి కుమార్ కౌంటర్

Published Date :December 23, 2021 , 1:27 pm
By Prakash
ఏపీ టికెట్ల వివాదం : నాని కామెంట్స్ పై నిర్మాత నట్టి కుమార్ కౌంటర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల వివాదం ముదురుతోంది. చాలామంది అక్కడ టికెట్ రేట్ల వివాదంపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన సినిమాలన్నీ ఆంధ్రాలో భారీగానే నష్టాలను ఎదురుకోవాల్సి వచ్చింది. దీంతో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు స్వచ్చందంగా థియేటర్లను క్లోజ్ చేసుకున్నారు. మరోవైపు సినిమా పెద్దలు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్ల విషయమై మరోసారి ఆలోచించాలని బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఉలకలేదు పలకలేదు. దీంతో కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి కోర్ట్ మెట్లెక్కారు. అయితే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం ఏమాత్రం చెవిన వేసుకోలేదు. సరికదా మరో పిటిషన్ తో తీర్పును సవాలు చేసింది. ఇదిలా ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టికెట్ ధరల విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నిర్మాత నట్టి కుమార్ కౌంటర్ వేయడం చర్చకు దారి తీసింది.

https://www.youtube.com/watch?v=Ev22N7AyWZE

“ఏపీలో టిక్కెట్ల విషయమై ఏం జరుగుతుందో అది కరెక్ట్ కాదని మనందరికీ తెలుసు… మీరు ప్రేక్షకులను అవమానిస్తున్నారు… ఇప్పటికీ చూస్తున్న టికెట్ రేట్స్ రూ.10, రూ.15, రూ. 20 అని… 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి థియేటర్లు నడుపుతున్న ఒక వ్యక్తి కౌంటర్ కంటే పక్కనే ఉన్న కిరాణా షాప్ కౌంటర్ ఎక్కువగా ఉంటే కరెక్ట్ కాదు” అంటూ తాజా ప్రెస్ మీట్లో నాని తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నాని వ్యాఖ్యలపై నిర్మాత నట్టి కుమార్ స్పందిస్తూ “నానికి సినిమా కలెక్షన్ల గురించి ఏం తెలుసు? ఆలోచించి మాట్లాడాలి” అంటూ మండిపడ్డారు. దీంతో సినిమా ఇండస్ట్రీ ఈ వివాదం వల్ల రెండుగా చీలే అవకాశం ఉంది. ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వర్గం ఒకటి, ప్రభుత్వం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న వర్గం ఒకటి. ఏదేమైనా రేపు మరోసారి కోర్టులో విచారణకు రానున్న ఈ వివాదంపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరోవైపు నాని ‘శ్యామ్ సింగ రాయ్’ రేపు విడుదలకు సిద్ధంగా ఉంది.

Read Also :

https://ntvtelugu.com/nani-sensational-comments-on-ap-ticket-rates/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Ticket Rates
  • AP Ticket Rates Issue
  • Nani
  • Producer Natti Kumar
  • Shyam Singha Roy

తాజావార్తలు

  • Sanju Samson: సంజు శాంసన్‌కు ఏమైంది..? వరల్డ్‌ కప్‌లో అలా.. ఐపీఎల్‌లో ఇలా ఏంటి..?

  • Sharwanand :శర్వానంద్ కి ఏమైంది? సక్సెస్ మీట్లలో ఆవేశం.. మాటల్లో తడబాటు.. అసలు కారణం ఇదేనా?

  • Rajya Sabha: శరద్ పవార్ సహా పలువురు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం

  • Sharanya Rescue: ట్రెక్కింగ్ చేస్తూ గల్లంతైన టెకీ సేఫ్.. నో ఫుడ్, నో నెట్‌వర్క్… ధైర్యంతో 4 రోజులు! శరణ్య స్టోరీ

  • Pradeep Ranganathan:దిల్ రాజు ఐడియా వలనే.. నాకు తెలుగులో ఇంత క్రేజ్ వచ్చింది

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions