ఈశ్వరా, పరమేశ్వరా, పవనేశ్వరా… అనే మూడు మంత్రాలని పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇచ్చాడు బండ్ల గణేష్. దేవర అంటూ పవన్ కళ్యాణ్ ని పిలిచే బండ్ల గణేష్ అంటే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి అభిమానం ఎక్కువ. పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్ చెప్పే మాటలు, అతను ఇచ్చే ఎలివేషన్స్ వంద సినిమాలు చేసిన డైరెక్టర్స్ కూడా ఇవ్వలేరు అందుకు పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ జరిగితే బండ్ల గణేష్ గెస్టుగా రావాలని వాళ్లు కోరుకుంటూ ఉంటారు. ఏ ఈవెంట్ లేకపోయినా పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్స్ చేస్తూ ఉంటాడు బండ్ల గమేష్, నేను పవన్ కళ్యాణ్ ని అతిపెద్ద భక్తుడిని అని చెప్పుకుంటూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ని దేవర అని పిలిచే నోటితో ఇప్పుడు బండ్ల గణేష్, రవితేజకి ఎలివేషన్స్ ఇస్తున్నాడు. మాస్ మహారాజ రవితేజ స్టార్ హీరో అవ్వకముండు నుంచి బండ్ల గణేష్ కి పరిచయం ఉంది కానీ ధమాకా సక్సస్ మీట్ అప్పటి నుంచి ఎందుకు బండ్ల గణేష్, రవితేజ గురించి ట్వీట్స్ చేస్తున్నాడు. టైగర్ పడుకుంది, కళ్లలో కసి, మీసంలో పౌరుషం, ముక్కు మీద రాజసం అంటూ రవితేజ ఫోటోలు పెట్టి కొటేషన్స్ ని పోస్ట్ చేస్తున్నాడు.
బండ్ల గణేష్ ట్వీట్స్ చూస్తున్న పవన్ కళ్యాణ్ ఫాన్స్ షాక్ అవుతుంటే, రవితేజ ఫాన్స్ ఏమో మమ్మల్నే మించిపోయే రేంజులో ఎలివేషన్స్ ఇస్తున్నావ్ ఏంటన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటివలే ఒక నెటిజన్… “ఏందన్నా బండ్లన్నా.. బండి పవర్ స్టార్ @PawanKalyan గారి దారిలోంచి మారి .. మాస్ మహారాజా @RaviTeja_offl గారి రోడ్డులోకి మళ్లింది.. దేవరను మరిచావా? భక్తి తగ్గిందా?” అంటూ స్ట్రెయిట్ క్వేషన్ వేశాడు. దీనికి అంతే స్ట్రెయిట్ గా, తనదైన స్టైల్ లో బండ్ల గణేష్ ఆన్సర్ ఇస్తూ… “నేను హిందువుని శ్రీశైలం వెళ్తాను తిరుపతి వెళ్తాను శబరిమల వెళ్తాను” అంటూ రిప్లై ఇచ్చాడు. అంటే పవన్ కళ్యాణ్ మీద అభిమానం తగ్గలేదు కానీ రవితేజని పొగడాల్సి వచ్చింది అని అర్ధం. ఇంతకీ ఇదంతా బండ్ల గణేష్ సినిమా కోసమే చేస్తున్నాడా? హీరోల డేట్స్ కోసమే ఎలివేషన్స్ ఇస్తున్నాడా? అంటే అవును అని స్ట్రెయిట్ గా సమాధానం చెప్పడం బండ్ల గణేష్ స్టైల్. మరి ఈ స్టార్ హీరోల్లో ఎవరైనా బండ్ల గణేష్ ని డేట్స్ ఇచ్చి ఆయన బ్యానర్ లో సినిమా చేస్తాడేమో చూడాలి.
కళ్ళల్లో కసి మీసం లో పౌరుషం ముక్కు మీద రాజసం @RaviTeja_offl pic.twitter.com/lsPLX1Dxov
— BANDLA GANESH. (@ganeshbandla) February 7, 2023
నేను హిందువుని శ్రీశైలం వెళ్తాను తిరుపతి వెళ్తాను శబరిమల వెళ్తాను 🙏 https://t.co/HeDs0T2FkA
— BANDLA GANESH. (@ganeshbandla) February 7, 2023