NTV Telugu Site icon

Priyanka Chopra: వాటితో విసిగిపోయా, అందుకే గుడ్‌బై చెప్పా.. ప్రియాంకా షాకింగ్ కామెంట్స్

Priyanka Bollywood

Priyanka Bollywood

Priyanka Chopra Reveals Why She Left Bollywood: తమ కెరీర్‌కి మెరుగులు దిద్దిన ఇండస్ట్రీ గురించి కొందరు భామలు తక్కువ చేసి మాట్లాడుతుంటారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి చెక్కేసిన కథానాయికల్లో కొంతమంది తెలుగు చిత్ర పరిశ్రమని హేళన చేసిన సంగతి తెలిసిందే! గ్లామర్ షో తప్ప ఏమీ ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రియాంకా చోప్రా కూడా అలాంటి వారి జాబితాలోకి చేరింది. హాలీవుడ్‌కి తన మకాం మార్చిన ఈ భామ.. తనకు అవకాశాలు ఇచ్చి, స్టార్డమ్ సాధించిపెట్టిన బాలీవుడ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో తనకొచ్చిన ఆఫర్ల పట్ల సంతోషంగా లేనని, అక్కడ రాజకీయాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ బాంబ్ పేల్చింది. తాను అభద్రతాభావానికి గురవ్వడం వల్లే.. బాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పాల్సి వచ్చిందని కుండబద్దలు కొట్టింది.

Honey Rose: దాని కోసం ఏం చేయడానికైనా రెడీ.. హనీ రోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ.. ‘‘బాలీవుడ్‌లో నన్ను ఒక మూలన పడేశారు. నాకు కొందరితో విభేదాలు ఏర్పడటం వల్ల.. అవకాశాలు రాకుండా చేశారు. ఆ ఇండస్ట్రీలో రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. నాకు ఆ పాలిటిక్స్ చేయడం తెలీదు. ఆ రాజకీయాలతో నేను విసిగెత్తిపోయి, బాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకోవాలని అనుకున్నా’’ అంటూ చెప్పుకొచ్చింది. ఆ సమయంలోనే తాను ఒక మ్యూజిక్ వీడియో చేయగా, దాన్ని అంజులా ఆచార్యా (ప్రస్తుతం ప్రియాంకా మేనేజర్) చూసి తనని సంప్రదించిందని తెలిపింది. యూఎస్‌లో మ్యూజిక్ కెరీర్ ప్రారంభిస్తావా? అని ఆఫర్ చేయడంతో, వెంటనే ఒప్పుకున్నానంది. అదే తన కెరీర్‌కి మెరుగులు దిద్దిందని, సరికొత్త ప్రపంచానికి (హాలీవుడ్)కి పరిచయం చేసిందని పేర్కొంది. ఇక అప్పుడే తాను అమెరికాకు షిఫ్ట్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నానని క్లారిటీ ఇచ్చింది. తన మ్యూజిక్ కెరీర్ వల్లే ‘క్వాంటికో’లో నటించే ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చింది.

Extramarital Affair: మరొకరితో భార్య ఎఫైర్.. భర్తకు తెలిసి ఏం చేశాడో తెలుసా?

కాగా.. క్వాంటికో సిరీస్ ద్వారా గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించిన ప్రియాంకా.. ఆ తర్వాత బేవాచ్, మ్యాట్రిక్స్, ద వైట్ టైగర్ వంటి సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంది. త్వరలోనే సిటాడెల్ సెకండ్ షో, లవ్ ఎగైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హాలీవుడ్‌కి మకాం మార్చిన తర్వాత నిక్ జోనస్‌తో పరిచయం అవ్వడం, అది ప్రేమగా మారడంతో.. అతడ్ని 2018 డిసెంబర్‌లో వివాహం చేసుకుంది. సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Show comments