Site icon NTV Telugu

ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన మరో స్టార్ హీరోయిన్ విడాకులు..?

టాలీవుడ్ లో మొన్నటివరకు సమంత- నాగ చైతన్య ల విడాకుల వార్తలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పకల్సిన అవసరం లేదు. తాము విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత అభిమానులు కొంత సర్దుకున్నారు. ఇక సామ్- చై విడాకుల న్యూస్ అయిన తరుణంలోనే మరో స్టార్ హీరోయిన్ విడాకుల వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రముఖ సీనియర్ నటి ప్రియమణి తన భర్తతో విడిపోతుందని వార్తలు గుప్పుమన్నాయి. 2017లో ప్రియమణి ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికే అతనికి అయేషా అనే మరో మహిళతో పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన భార్యకు విడాకులు ఇచ్చి ప్రియమణిని పెళ్లిచేసుకున్నానని ముస్తఫా అంటుండగా.. నాకు విడాకులు ఇవ్వలేదని, నా బిడ్డలను కూడా అట్టించుకోవడం లేదని అయేషా.. కొన్ని రోజుల ముందు మీడియా ముందుకు వచ్చి వాపోయింది. దీంతో ప్రియమణి షాకింగ్ డెసిషన్ తీసుకుందని, భర్తకు విడాకులు ఇస్తుందన్న పుకార్లు గుప్పుమన్నాయి.

ఇక వీటిపై ఎప్పుడు స్పందించని ప్రియమణి పరోక్షంగా ఈ రూమర్స్ కి చెక్ పెట్టింది. ఇటీవల దీపావళి పండగను భర్త ముస్తఫా కుటుంబంతో కలిసి జరుపుకున్న ఈ భామ అందుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భర్తతో ఆనందంగా ఉన్న ప్రియమణి.. తామెప్పుడూ కలిసేఉంటామని చెప్పకనే చెప్పింది. ఇక ఇటీవల నారప్ప చిత్రంలో మెరిసిన ఈ భామ ప్రస్తుతం విరాట పర్వంలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.

Exit mobile version