Priya Vadlamani Sizzling Photoshoot: హీరోయిన్ ప్రియా వడ్లమాని అంటే మనలో చాలా మందికి గుర్తు పట్టడం కష్టమే కానీ ‘హుషారు’లో లవర్ కి హ్యాండ్ ఇచ్చినఅమ్మాయి అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు. నిజానికి అది ఆమె ఫస్ట్ సినిమా కాదు కానీ ఆ సినిమాతో మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. తెలుగమ్మాయి అయిన ప్రియ 2018లో ‘ప్రేమకు రెయిన్ చెక్’ అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత శరత్ నర్వాడే డైరెక్షన్లో ‘శుభలేఖలు’ అని మరో సినిమా కూడా చేసింది కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. ఇక ఆ తరువాత చేసిన ‘హుషారు’ సినిమా ఆమెకు కొంత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో ‘అందం అమ్మాయైతే నీలా ఉందే’ పాట ఈమె కోసమే రాశారా అన్నట్టు ఒక రేంజ్ గుర్తింపు ఆమెకు లభించింది.
Meher Ramesh: మెహర్ రమేష్ మహేష్ బాబు ఫ్రెండ్ గా నటించాడని మీకు తెలుసా?
ఇక ఆమె ‘హుషారు’ తర్వాత ఆవిరి, కాలేజ్ కుమార్ అని మరో రెండు సినిమాలు కూడా చేసింది కానీ అవి కూడా వర్కౌట్ అవలేదు. గతేడాది చివర్లో కలర్ ఫోటో దర్శకుడి ‘ముఖచిత్రం’ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న రెండు పాత్రల్లో నటించి అందరినీ మెప్పించింది ప్రియా వడ్లమాని. గ్లామర్ పరంగా ఒంపుసొంపులు అన్నీ బాగానే ఉన్నా ఎందుకో పూర్తి స్థాయిలో అయితే అవకాశాలు రావడం లేదని చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే హాట్ హాట్ ఫొటోషూట్స్ చేస్తూ రచ్చ రేపుతోంది. తాజాగా ఆమె టాప్ ధరించకుండా కేవలం బ్రాసరీ మాత్రమే ధరించి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫొటోలు మీరు కూడా చూసేయండి మరి.