కన్నుగీటి యూత్ గుండెలను కొల్లగొట్టి సైడ్ క్యారెక్టర్ నుండి మెయిన్ లీడ్‌కు షిఫ్ట్ అయిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ఒరు ఆధార్ లవ్‌లో తెరంగేట్రం చేసిన ఈ మలయాళ కుట్టీ ఆ తర్వాత మ్యాజిక్ చేయడంలో బొక్కా బోర్లా పడింది. ఆమెకున్న క్రేజ్ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయింది. టాలీవుడ్, మాలీవుడ్‌లో చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లు కావడంతో ఫేమ్ పడిపోయింది. తెలుగులో చెక్, ఇష్క్, బ్రో చేసింది ప్రియా కానీ ఒక్కటి కూడా హిట్ సౌండే చేయలేదు.
Also Read : Urvashi Rautela : ఐటమ్ సాంగ్స్‌తో కేక పుట్టిస్తోన్న హాట్ బ్యూటీ.. కానీ?
టాలీవుడ్, మాలీవుడ్ అచ్చిరావట్లేదని బాలీవుడ్‌లో ప్రయత్నాలు చేసింది బ్యూటీ. అక్కడ సేమ్ సిచ్చయేషన్. కన్నడలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఫేట్ కలిసి రాలేదు. చివరకు ఆమెకు కాస్తో కూస్తో రెప్యుటేషన్ ఇచ్చింది తమిళ ఇండస్ట్రీ. నిలవుక్కు ఎన్మేల్ ఎన్నాడీ కోబంలో సెకండ్ హీరోయిన్ రోల్‌లో కాస్త మెప్పించింది కేరళ కుట్టీ. ఇక రీసెంట్లీ వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీలో అర్జున్ దాస్‌కు జోడీగా కనిపించి ఆకట్టుకుంది. కోలీవుడ్‌లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతుంది. గుడ్ బ్యాడ్ అగ్లీలో కనిపించింది కాసేపే అయినా ఎంటర్ టైన్ బాగానే చేసింది. ముఖ్యంగా అర్జున్ దాస్- ప్రియా మధ్య రొమాంటిక్ డ్యాన్స్ బిట్ కు విజిల్స్ వేస్తున్నారు ఆడియన్స్. చెప్పాలంటే త్రిష కన్నాప్రియా పేరే గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి హిట్ కొట్టేసిన బ్యూటీ చేతిలో ప్రజెంట్ టూ బాలీవుడ్ ఫిల్మ్స్ ఉన్నాయి. త్రీ మంకిస్, లవ్ హ్యాకర్స్ అనే చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పటి వరకు ఆల్ ఇండస్ట్రీలను చుట్టేసిన ప్రియాకు కోలీవుడ్ మంచి ఐడెంటిటీని ఇచ్చింది. ఇక ప్రియా మెల్లిగా కోలీవుడ్ షిఫ్ట్ అయిపోతుందేమో చూడాలి.